Begin typing your search above and press return to search.

చికెన్ ను తలదన్నుతున్న టమాటా... కొత్తధర పీక్స్!

అవును... రాబోయే రోజుల్లో టమాటా ధర దేశవ్యాప్తంగా రూ.300కు చేరే ఛాన్స్ ఉందని అంటున్నారట ఎన్.సి.ఎం.ఎల్. సీఈవో రమేష్ గుప్తా

By:  Tupaki Desk   |   16 July 2023 8:08 AM GMT
చికెన్  ను తలదన్నుతున్న టమాటా... కొత్తధర పీక్స్!
X

ప్రస్తుతం కేజీ టమాటా ధర సగటున రూ.100 నుంచి రూ.150 వరకూ పలుకుతోందని అంటున్నారు. దీంతో... ఆల్ టైం గరిష్టానికి టామాటా ధర పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎన్.సి.ఎం.ఎల్. నుంచి కీలక విషయాలు వెళ్లడించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధర టాప్ లేపేస్తుందని అంటున్నారు. అలా అని టమాటా రైతులంతా లక్షాధికారులు అయిపోరనేది వాస్తవం అనేది తెలిసిన విషయమే! కారణం... ఇది కృత్రిమంగా సృష్టించిన కొరత అనేది పలువురి అభిప్రాయంగా ఉంది. నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈవో త్వరలో ఈ ధర రూ. 300కి చేరుతుందని చెబుతున్నారని తెలుస్తుంది.

అవును... రాబోయే రోజుల్లో టమాటా ధర దేశవ్యాప్తంగా రూ.300కు చేరే ఛాన్స్ ఉందని అంటున్నారట ఎన్.సి.ఎం.ఎల్. సీఈవో రమేష్ గుప్తా. వర్షాల వల్ల దిగుబడి మరింత తగ్గడంతో ముందుముందు ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారని తెలుస్తుంది.

కాగా... చండీగడ్ మార్కెట్ లో ఇప్పటికే టమాటా ధరలు రూ.200 నుంచి రూ.250 కి పలుకుతున్నాయని అంటున్నారు. ఇక రిటైల్ దుకాణాల్లో అయితే ఏకంగా రూ. 300 నుంచి రూ.400 కు విక్రయిస్తున్నారని అంటున్నారు.

అయితే ఈ ధరలు చూసిన స్థానికులు.. లీటర్‌ పెట్రోల్‌ కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతుంటే... నాన్ వెజ్ ప్రియులు మాత్రం కిలో చికెన్ ధరే తక్కువగా ఉందని చెబుతున్నారంట. దీంతో... ధరలు పెరుగుతున్న క్రమంలో టమాటాలు నిల్వ ఉంచుకున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని తెలుస్తుంది.

మరోపక్క... ప్రతీ రోజు మీడియాలో "నేటి బంగారం ధరలు" అని ప్రత్యేకంగా ఒక వార్త ప్రసారం చేసినట్లు... "నేటి టమాటా ధర" అని కూడా ప్రసారం చేయాల్సి వస్తుందేమో అని కామెంట్లు పెడుతున్నారట నెటిజన్లు. "రూ.20 తగ్గిన టమాటా"... "మరోసారి చేదువార్త చెప్పిన టమాటా".. వంటి వార్తలు ఇకపై డైలీ ప్రత్యక్షమైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు!