Begin typing your search above and press return to search.

పిక్ వైరల్... ఓపెన్‌ కల్చర్‌ అంటే మరీ ఇంత ఓపెన్‌ అనుకోలేదు!

వివరాళ్లోకి వెళ్తే... మలేసియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఎయిర్‌ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌ తాజాగా లింక్డిన్‌, ఎక్స్‌ (ట్విటర్) లో ఓ పోస్ట్‌ పెట్టారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 3:52 AM GMT
పిక్ వైరల్... ఓపెన్‌  కల్చర్‌  అంటే మరీ ఇంత ఓపెన్‌  అనుకోలేదు!
X

మలేషియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఎయిర్‌ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు అభిమానులుగా ఉన్న నెటిజ‌న్లు సైతం ఇప్పుడు తీవ్రంగా విమ‌ర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తి, ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఇలా చేయడం ఏమిటంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఏమిటీ ఆ చర్య, దానికి ఆయన వెర్షన్ ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం...!

వివరాళ్లోకి వెళ్తే... మలేసియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఎయిర్‌ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌ తాజాగా లింక్డిన్‌, ఎక్స్‌ (ట్విటర్) లో ఓ పోస్ట్‌ పెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలో ఆయన షర్ట్ లేకుండా ఉన్నారు. అంతేకాదు.. ఆ సమయంలో ఆయనకు ఒక మహిళ మసాజ్ చేస్తూ కనిపించారు. అది ఆయన సంస్థ అధికారులు, ఉన్నతోద్యోగుల‌తో వర్చువల్ మీటింగ్ లో ఉండగా జరిగిన సంఘటన కావడం గమనార్హం.

అవును... షర్ట్‌ లేకుండా ఆయన ఒక వర్చువల్‌ మీటింగ్‌ కు హాజరయ్యారు.. ఆ సమయంలో ఆయన మసాజ్‌ చేసుకుంటూ మేనేజమెంట్‌ మీటింగ్‌ కండక్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫైరవుతున్నారు. అయితే ఈ విషయం ఇతరులు ఎవరూ వెల్లడించలేదు.. ఆయనకు ఆయనే ఈ ఫోటోను ఆన్ లైన్ లో షేర్ చేశారు. బిజీ షెడ్యూల్డ్ వల్ల ఇలా అని ఆయన చెప్పుకుంటున్నా... నెటిజన్లు మాత్రం మరోరకంగా తీసుకున్నారు!

ఇలా మసాజ్‌ చేసుకుంటూ మేనేజమెంట్‌ మీటింగ్‌ కు హాజరైనట్లు ఆయనే స్వయంగా ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు. ఎయిర్‌ ఏషియాలో పని సంస్కృతికి నిదర్శనం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదే సమయంలో... ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. దీంతో... ఈ పోస్ట్‌ పెట్టిన కాసేపటికే వైరల్‌ గా మారింది. దీంతో నెటిజన్లు తిట్ల పురాణం అందుకున్నారు.

"ఒక లిస్టెడ్‌ కంపెనీకి సీఈఓగా ఉంటూ.. మేనేజ్మెంట్‌ మీటింగ్‌ కు ఇలా షర్ట్‌ లేకుండా హాజరవ్వడం ఏమాత్రం సభ్యత అనిపించుకోదు" అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టగా... "బహుశా ఎవరో ఆయన లింక్డిన్‌ ను హ్యాక్‌ చేసి ఉంటారు" అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. అనంతరం వెటకారంగా మరికొంతమంది నెటిజన్లు స్పందించారు. ఎంత ఓపెన్ కల్చర్ అయితే మాత్రం ఇంత ఓపేనా అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఏ సినిమాలో సీన్ అంటూ ఇంకొందరు వెటకరించారు.

"ఓపెన్‌ కల్చర్‌ అంటే మరీ ఇంత ఓపెన్‌ అనుకోలేదు" అంటూ ఒక నెటిజన్‌ వెటకారం ఆడగా... "మీ పని బాగుంది" అని మరికొంతమంది సటైర్లు వేస్తున్నారు. ఇంకొందరైతే పర్సనల్ పనులను పబ్లిక్‌ లో పెట్టడం ఏంటని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. నెటిజన్ల నుంచి ఈ స్థాయిలో కామెంట్లు వచ్చినప్పటికీ ఫెర్నాండెజ్‌ సదరు పోస్ట్‌ ను డిలీట్‌ చేయకపోవడం గమనార్హం. అయితే, కొందరు నెటిజన్లు పరుషంగా పెట్టిన కామెంట్లను మాత్రం ఆయన డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది.