రాష్ట్రంలో ఆ మూడు జిల్లాలే టాప్.. చివరి జిల్లా ఏదంటే?
దేశ అభివృద్ధి స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) పై ఆధారపడి ఉంటుంది. జీడీపీ పెరిగితే, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.
By: Tupaki Desk | 3 March 2025 5:00 PM ISTదేశ అభివృద్ధి స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) పై ఆధారపడి ఉంటుంది. జీడీపీ పెరిగితే, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశ జీడీపీపై నివేదికను విడుదల చేస్తుంది. అంతే కాకుండా రాష్ట్రాలు , జిల్లాల వారీగా కూడా కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలను అందిస్తుంది. తాజాగా విడుదలైన 2022–23 సంవత్సరానికి సంబంధించిన నివేదికలో, తెలంగాణలో కేవలం మూడు జిల్లాలు మాత్రమే ఆర్థికంగా ముందంజలో ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా, వీటిలో మూడే అత్యుత్తమ స్థానాల్లో నిలిచాయి.
- టాప్ 3 జిల్లాలు:
1. రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ను చుట్టుముట్టి ఉంటుంది. ఇది ఐటీ కారిడార్‌లు (గచ్చిబౌలి, మాదాపూర్), పారిశ్రామిక ప్రాంతాలు (షామీర్‌పేట్), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందింది. ఈ జిల్లా రాష్ట్ర జీడీపీ (GSDP) లో కీలక పాత్ర పోషిస్తుంది. జిల్లా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీడీపీ) రూ.2.85 లక్షల కోట్లుగా ఉంది. ఇది రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించింది.
2. హైదరాబాద్ జిల్లా
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మాత్రమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాల ముఖ్య కేంద్రంగా ఉంది. ఇక్కడ ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, సేవా రంగాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో దాదాపు 54% వాటా ఈ జిల్లాకే చెందింది. హైదరాబాద్ జిల్లా జీడీడీపీ రూ.2.30 లక్షల కోట్లుగా ఉంది, ఇది రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.
3. మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా
ఈ జిల్లా హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉండి, ఐటీ, తయారీ రంగాలు, వాణిజ్య కార్యకలాపాలతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉప్పల్, కుషాయిగూడ వంటి ప్రాంతాలు దీని ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తున్నాయి. మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా జీడీడీపీ రూ.88,940 కోట్లుగా ఉంది, దీని వలన ఇది మూడో స్థానంలో నిలిచింది.
- మిగతా జిల్లాల స్థితిగతులు:
4. సంగారెడ్డి జిల్లా
జీడీడీపీ: రూ. 35,717 కోట్లు
కారణం: పారిశ్రామిక అభివృద్ధి , హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం.
5. నల్గొండ జిల్లా
జీడీడీపీ: రూ. 27,304 కోట్లు
కారణం: వ్యవసాయం , చిన్న తరహా పరిశ్రమలు.
- చివరి స్థానంలో ఉన్న జిల్లా:
ములుగు జిల్లా
జీడీడీపీ: రూ. 3,500 కోట్లు
కారణం: తక్కువ పారిశ్రామిక జిల్లా.. పరిమిత వాణిజ్య కార్యకలాపాలు.
ఈ జాబితాలో ప్రస్తావించిన టాప్ 5 జిల్లాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మిగిలిన జిల్లాల ఆర్థిక ఉత్పత్తి వాటా గణనీయంగా తక్కువగా ఉంది. ఈ ర్యాంకులు ‘సోషియో–ఎకనామిక్ ఔట్‌లుక్ 2024‘ నివేదిక , ఇతర వనరుల ఆధారంగా రూపొందించబడ్డాయి.