Begin typing your search above and press return to search.

భారీగా పెరిగిన భారతీయ సంపన్నుల సంపద... టాప్-10లో ఎవరెవరంటే..?

గత ఏడాదితో పోలిస్తే సుమారు 40% పెరిగి 1.1. ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. 2023లో ఈ మొత్తం 799 బిలియన్ డాలర్లుగా ఉండేది

By:  Tupaki Desk   |   10 Oct 2024 4:14 PM GMT
భారీగా పెరిగిన భారతీయ సంపన్నుల సంపద... టాప్-10లో ఎవరెవరంటే..?
X

భారతదేశంలోని 100 మంది ధనవంతుల జబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ 100 మంది ధనవంతుల మొత్తం సంపద 2024 నాటికి తొలిసారిగా ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించిందని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 40% పెరిగి 1.1. ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. 2023లో ఈ మొత్తం 799 బిలియన్ డాలర్లుగా ఉండేది.

అవును... భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే వీరి మొత్తం సంపద ఏకంగా 40% పెరిగిందని.. ఫలితంగా ట్రిలియన్ డాలర్స్ మార్కును అధిగమించిందని తెలిపింది. ఇదే సమయంలో ఈ జాబితాలోని 58 మంది తమ సంబంధిత నికర విలువకు $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ జోడించారని తెలిపింది.

ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచారు. 119.5 బిలియన్ డాలర్లతో అంబానీ అగ్రస్థానం సాధించారు. ఇక గత ఏడాదితో పోలిస్తే ఆయన సంపద 27.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ జాబితాలో రెండో స్థానంలో గౌతం అదానీ నిలిచారు. ఆయన కుటుంబ నికర విలువ 116 బిలియన్ డాలర్లు.

ఇక మూడోస్థానంలో 43.7 బిలియన్ డాలర్లతో సావిత్రి జిందాల్ ఉండగా... 40.2 బిలియన్ డాలర్లతో శివ నాడార్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇక దిలీప్ షాంఘ్వీ ఈ ఏడాది మూడు స్థానాలు ఎగబాకి 32.4 బిలియన్ డాలర్లతో 5వ స్థానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత్ లోని టాప్ 10 ధనవంతుల జాబితాను పరిశీలిద్దాం...!

1) ముఖేష్ అంబానీ - $119.5 బిలియన్లు

2) గౌతం అదానీ & ఫ్యామిలీ - $116 బిలియన్లు

3) సావిత్రి జిందాల్ & ఫ్యామిలీ - $43.7 బిలియన్లు

4) శివ్ నాడార్ - $40.2 బిలియన్లు

5) దిలీప్ షాంఘ్వీ & ఫ్యామిలీ - $32.4 బిలియన్లు

6) రాధాకృష్ణా దామిని & ఫ్యామిలీ - $31.5 బిలియన్లు

7) సునీల్ మిట్టల్ $ ఫ్యామిలీ - $30.7 బిలియన్లు

8) కుమార్ బిర్లా - $24.8 బిలియన్లు

9) సైరస్ పూనవల్ల - $24.5 బిలియన్లు

10) బజాజ్ ఫ్యామిలీ - $23.4 బిలియన్లు