Begin typing your search above and press return to search.

ఫోర్బ్స్ 2024... టాప్-10 రిచ్చెస్ట్ ఇండియన్స్.. జాబితాలో ఒకరే మహిళ!

అవును... భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:33 PM GMT
ఫోర్బ్స్  2024... టాప్-10 రిచ్చెస్ట్  ఇండియన్స్.. జాబితాలో ఒకరే మహిళ!
X

ప్రతీ ఏడాది ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను విడుదల చేస్తుంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 2024కు సంబంధించి భారతదేశానికి చెందిన కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇదే సమయంలో... 100 మంది ధనవంతుల మొత్తం సంపద 2024 నాటికి తొలిసారిగా ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించిందని వెల్లడించింది.

అవును... భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఇదే సమయంలో టాప్ 100 రిచెస్ట్ వ్యక్తుల సంపద విలువ 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇక టాప్ 10 రిచ్చెస్ట్ జాబితాలో మొదటి స్థానంలో రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన సంపద 119.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే... సుమారు రూ.10 లక్షల కోట్లకు పైమాటే అన్నమాట.

ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ఈయన సంపద విలువ 116 బిలియన్ డాలరుగా ఉంది. అంటే... 9.75 లక్షల కోఈట్ల రూపాయలకు సమానం. ఈ క్రమంలో... ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు సావిత్రి జిందాల్. ఈమె సంపద 43.7 బిలియన్ డాలర్లు. టాప్ 10 లిస్ట్ లో ఉన్న ఏకైక మహిళగా ఆమె నిలిచారు.

ఇదే క్రమంలో... ఈ జాబితాలో నాలుగో స్థానంలో హెచ్.సీ.ఎల్. టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ శివ్ నాడార్ నిలిచారు. ఆయన సంపద 40.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక.. సన్ ఫార్మాష్యూటికల్స్ కు చెందిన దిలీప్ సంఘ్వీ అండ్ ఫ్యామిలీ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. వీరి సంపద 32.4 మిలియన్ డాలర్లుగా ఉంది.

తాజా జాబితా ప్రకారం టాప్ 10 రిచ్చెస్ట్ ఇండియన్స్ జాబితా!:

1) ముఖేష్ అంబానీ - 119.5 బిలియన్ డాలర్స్

2) గౌతం అదానీ & ఫ్యామిలీ - 116 బిలియన్ డాలర్స్

3) సావిత్రి జిందాల్ & ఫ్యామిలీ - 43.7 బిలియన్ డాలర్స్

4) శివ్ నాడార్ - 40.2 బిలియన్ డాలర్స్

5) దిలీప్ షాంఘ్వీ & ఫ్యామిలీ - 32.4 బిలియన్ డాలర్స్

6) రాధాకృష్ణా దామిని & ఫ్యామిలీ - 31.5 బిలియన్ డాలర్స్

7) సునీల్ మిట్టల్ & ఫ్యామిలీ - 30.7 బిలియన్ డాలర్స్

8) కుమార్ బిర్లా - 24.8 బిలియన్ డాలర్స్

9) సైరస్ పూనవల్ల - 24.5 బిలియన్ డాలర్స్

10) బజాజ్ ఫ్యామిలీ - 23.4 బిలియన్ డాలర్స్