భారీగా పెరుగుతోన్న భారత్ అప్పులు... ఇవే టాప్ 10 రాష్ట్రాలు!
ఇదే సమయంలో.. రాష్ట్రాల వారీగా ఉన్న అప్పుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది!
By: Tupaki Desk | 7 March 2025 9:22 AMచాలా కాలంగా భారత్ ను అభివృద్ధి చెందుతున్న దేశంగా చెబుతోన్న సంగతి తెలిసిందే. ఆ సంగతి కాసేపు పక్కన పెడితే... దేశంపై అప్పు భారం కూడా పెరుగుతోందని అంటున్నారు. ఈ సందర్భంగా దేశంపై అప్పును కేంద్రం వెల్లడించింది! ఇదే సమయంలో.. రాష్ట్రాల వారీగా ఉన్న అప్పుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది!
అవును... అభివృద్ధితో పాటు దేశంపై అప్పు భారం కూడా పెరుగుతోందని చెప్పే గణాంకాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... ప్రస్తుతం భారత్ పై రూ.181 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు కేంద్రం బడ్జెట్ లో తెలిపింది. ఇదే సమయంలో... వచ్చే ఏడాది నాటికి ఈ అప్పు రూ.196 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
ఇదే సమయంలో దేశంలో అనేక రాష్ట్రాల్లో అప్పులు భారీగా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది! దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఈ సందర్భంగా... గత ఐదేళ్ళలో పలు రాష్ట్రాల అప్పుల్లో భారీ పెరుగుదల ఉందని ఆర్బీఐ చెబుతోంది! ఇందులో హాగంగా... 74% పెరుగుదల ఉందని చెబుతోంది.
ఈ సందర్భంగా... 2019 సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అప్పులు రూ.47.9 లక్షల కోట్లుగా ఉండగా.. అది ఇప్పుడు రూ.83.3 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపింది! ఇక 2024నాటికి భారతదేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాల వివరాలు వెల్లడించింది.
ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి రూ.8.3 లక్షల కోట్ల అప్పు ఉందని.. ఇది దేశంలోనే మొదటి స్థానమని తెలిపింది. ఇక రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రానికి ఉన్నా అప్పు రూ.7.7 లక్షల కోట్లు కాగా.. మూడో స్థానంలో మహారాష్ట్ర రూ.7.2 లక్షల కోట్లతో ఉంది.
ఆ తర్వాత నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్ రూ.6.6 లక్షల కోట్ల అప్పులతో ఉండగా... రూ.6 లక్షల కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది కర్ణాటక రాష్ట్రం. ఇదే సమయంలో... రూ.5.6 లక్షల కోట్లతో రాజస్థాన్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది!
అనంతరం ఆంధ్రప్రదేశ్ రూ.4.9 లక్షల కోట్ల అప్పుతో ఏడో స్థానంలో.. గుజరాత్ రూ.4.7 లక్షల కోట్లతో ఎనిమిదో స్థానం కేరళ రూ.4.3 లక్షల కోట్ల అప్పుతో తొమ్మిదో స్థానం.. మధ్య ప్రదేశ్ రూ.4.2 లక్షల కోట్లతో పదో స్థానంలో ఉన్నాయి!