Begin typing your search above and press return to search.

తాజా రిపోర్టు: ప్రపంచంలో టాప్ 10 సైట్లు ఏవి?

ఆ ఏడాది టిక్ టాక్ దెబ్బకు గూగుల్ కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే.. తర్వాతి కాలంలో మళ్లీ గూగుల్ తన అధిక్యతను ప్రదర్శించి.. టాప్ లో నిలిచింది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 4:56 AM GMT
తాజా రిపోర్టు: ప్రపంచంలో టాప్ 10 సైట్లు ఏవి?
X

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నిత్యం అనుక్షణం కాకుండా.. చాలా తరచుగా ఏదో ఒక పనికి సంబంధించి ఇంటర్నెట్ అవసరం ఉండటం తెలిసిందే. ఇలాంటి వేళలో.. ఎక్కువగా వెతికే వెబ్ సైట్లు ఏవి? అన్నది ఒక ప్రశ్న. అయితే.. దీనికి సంబంధించిన ఒక రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది. ప్రపంచంలో కొన్ని వందల కోట్ల వెబ్ సైట్లు ఉన్నప్పటికీ.. ప్రపంచ నెంబర్ వన్ వెబ్ సైట్ స్థానాన్ని గూగుల్ సొంతం చేసుకుంది. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ వెబ్ సైట్ గా పేర్కొన్న గూగుల్ అక్కడితో ఆగలేదు. టాప్ 10లో నాలుగు గూగుల్ కు చెందిన వెబ్ సైట్లే ఉండటం విశేషం.

గడిచిన కొన్నేళ్లుగా వెబ్ సైట్లలో గూగుల్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటం తెలిసిందే. అయితే.. దీని జోరుకు తొలిసారి బ్రేక్ పడింది మాత్రం 2021 చివర్లో. ఆ ఏడాది టిక్ టాక్ దెబ్బకు గూగుల్ కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే.. తర్వాతి కాలంలో మళ్లీ గూగుల్ తన అధిక్యతను ప్రదర్శించి.. టాప్ లో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 వెబ్ సైట్ల లెక్కల్లోకి వెళితే..

1. గూగుల్

2. గూగుల్ మ్యాప్స్

3. ఫేస్ బుక్

4. యాపిల్

5. జీస్టాటిక్

6. మైక్రోసాఫ్ట్

7. టిక్ టాక్ సీడీఎన్

8. గూగుల్ వీడియో

9. అమెజాన్ ఏడబ్ల్యూఎస్

10. డబుల్ క్లిక్ డాట్ నెట్

గూగుల్ క్లౌడ్ సర్వీసులకు సంబంధించిన సైట్ గూగుల్ ఏపిస్ కాగా.. గూగుల్ లో వెతికిన డేటాను క్రోడీకరించి వేగంగా లోడ్ చేసేది జీస్టాటిక్ వెబ్ సైట్. అమెజాన్ ఏడబ్ల్యూఎస్ విషయానికి వస్తే.. ఆ సంస్థ క్లౌడ్ స్టోరీగా చెప్పాలి. ఇక.. పాపులర్ వెబ్ సైట్ల జాబితాలో యూట్యూబ్ 11వ స్థానంలో.. అమెజాన్ 18వ ప్లేస్ లో.. ఇన్ స్టా 24వ స్థానంలో నిలిచింది. వినోదాల విందుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నెట్ ఫ్లిక్స్ 25వ స్థానంలో నిలిస్తే.. వాట్సాప్ 29వ స్థానంలో.. స్పాటిఫై 35వ స్తానంలో.. స్నాప్ చాట్ 40వ ప్లేస్ లో.. ట్విటర్ 45వ ప్లేస్ లో.. లింక్డిన్ 68వ స్థానంలో.. జీమొయిల్ 79వ ప్లేస్ లో ఉన్నట్లుగా గుర్తించారు.