అమెరికాలో సెక్స్ స్కాం.. 2008 నాటి టాప్ మోడల్ సూసైడ్ రీజన్ వెలుగులోకి
వీటిలో ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం.. రష్యాకు చెందిన టాప్ మోడల్ రుస్లానా కొర్షునోవా సూసైడ్.
By: Tupaki Desk | 6 Jan 2024 3:30 PM GMTఅగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నతస్థాయి వ్యక్తులు నెరిపిన సెక్స్ కుంభకోణం.. తాజాగా వెలుగు చూసిం ది. దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతున్న క్రమంలో దీనికి సంబంధించిన పలు కీలక విషయాలను స్థాని క కోర్టు బహిర్గతం చేసింది. దీంతో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. వీటిలో ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం.. రష్యాకు చెందిన టాప్ మోడల్ రుస్లానా కొర్షునోవా సూసైడ్.
వాస్తవానికి కొర్షునోవా.. 2008లోనే న్యూయార్క్‌లోని ఓ విలాసవంతమైన భవనం 9వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే.. అప్పట్లో ఇది ఎలా జరిగింది? దీనికి కారణాలేంటి? అనేవి మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయాయి. అయితే.. తాజాగా వెలుగు చూసిన రహస్య పత్రాల్లో దీనికి సంబంధించి కీలక ఆధారాలు లభించాయి. వీటిని నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు.. కారణాలను తేల్చే పనిలో ఉన్నారు.
ఏంటా కూపీ..?
అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియర్.. జెఫ్రీ ఎప్ స్టీన్.. ఉమనైజర్. వయసుతో నిమిత్తం లేకుండా.. ఆడది కనిపిస్తే చాలు.. తన సొంత ఐలాండ్‌కు తీసుకు వెళ్లి.. అక్కడ అనుభవిస్తుంటాడు. ఇతనికి వర్జిన్ ఐలాండ్స్‌లోని ప్రైవేటు ఐలాండ్ ఉంది. తను కోరుకున్నవారిని అక్కడకు తీసుకువెళ్లి.. పనికానిస్తుంటాడు. ఇలా.. పేద, మధ్య తరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశగా చూపించి, ఆ ఐలాండ్‌కు పిలిపించి ఎప్‌స్టీన్ అఘాయిత్యాలకు పాల్పడేవాడు.
ఇలా.. ఓ సందర్భంలో టాప్ మోడల్ కొర్షునోవా కూడా.. ఎప్‌స్టీన్ కు చెందిన ‘లోలితా ఎక్స్‌ప్రెస్’ విమానం లో అతని పామ్ బీచ్ బంగ్లాకు వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో ఏమో.. తెలియదు కానీ.. ఇలా బీచ్ బంగళా కు వెళ్లిన తర్వాత.. రెండేళ్లకు 2008లో న్యూయార్క్‌లోని విలాసవంతమైన భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయానికి కొర్షునోవా వయసు కేవలం 18 ఏళ్లే కావడం గమనార్హం. ఈమె ఆత్మహత్య.. అప్పట్లో పెద్ద మిస్టరీ గా మారింది.
అయితే.. తాజాగా కోర్టు వెలువరించిన పత్రాల ద్వారా కొర్షునోవా ఆత్మహత్యకు సంబంధించిన `తీగ` అయితే దొరికిందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఇక, దీనిపై లోతైన విచారణ జరిగితే.. అసలు సంగతి వెలుగు చూస్తుందని అంటున్నాయి.
ఎవరీ కొర్షునోవా?
రష్యాకు చెందిన కొర్షునోవా.. టాప్ మోడల్. పలు ప్రముఖ బ్రాండ్‌లకు ఆమె మోడల్‌గా పనిచేశారు. ఆమె చాలా అందగత్తె. ఎలాంటి వారినైనా తన కళ్లతో ఇట్టే ఆకట్టుకోగల సొగసు ఆమె సొంతం. పిన్న వయసులోనే ఆమె మోడలింగ్ రంగాన్ని ఏలుతుందని మేధావులు అంచనా వేశారు. కానీ 20 ఏళ్ల వయసులోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడడంతో అందరూ ఖిన్నులయ్యారు.