Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల‌ను షేక్ చేసేలా.. తెలంగాణ‌లో ఆరు గ్యారెంటీలు షురూ!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 12:26 PM GMT
ఎన్నిక‌ల‌ను షేక్ చేసేలా.. తెలంగాణ‌లో ఆరు గ్యారెంటీలు షురూ!
X

తెలంగాణలో ఏర్ప‌డిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కు ఇప్ప‌టికే శ్రీకారం చుట్టింది. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసేందుకు కూడా యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా సచివాలయంలో అభయ హస్తం కార్యక్రమం ప్రారం భమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు.

ప్రజాపాలన లోగోను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీల ప్రొఫార్మాను రూ పొందించారు. రేపటి (గురువారం) నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ మొదలుకానుంది. ఈ ద‌ర ఖాస్తుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం జనవరి 6 వరకు కొనసాగనుంది. ఇక‌, ఇప్ప‌టికే ఇచ్చిన గ్యారెంటీల్లో మ‌హిళ ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని అమ‌ల్లోకి తెచ్చారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పంద‌న ల‌భిం చింది. కేవ‌లం తెలంగాణ గుర్తింపు కార్డు ఉన్న మ‌హిళ‌ల‌కు ఈ సౌక‌ర్యం క‌ల్పించారు.

ఇక‌, ఇప్పుడు మిగిలిన గ్యారెంటీపైనా దృష్టి పెట్టారు. మ‌హాల‌క్ష్మి ప‌ధ‌కం కింద ప్ర‌తి మ‌హిళ‌కు రూ.2500 న‌గ‌దు ఇచ్చే కార్య‌క్ర‌మం, రూ.500ల‌తో గ్యాస్ సిలెండ‌ర్ వంటివి కీల‌కంగా ఉన్నాయి. ఇక‌, వీటితో పాటు రైతు భ‌రోసా కింద రూ.15000 రూపాయ‌ల‌ను అందించే కార్య‌క్ర‌మానికి ఇప్పుడు ద‌ర‌ఖాస్తులు తీసుకోనున్నా రు. అదేవిధంగా వ్య‌వ‌సాయ కార్మికుల‌కు రూ.12000 చొప్పున అందించే కార్య‌క్ర‌మానికి కూడా శ్రీకారం చుట్ట‌నున్నారు.

వీటికి సంబంధించి అర్హులైన వారిని ఎంపిక చేసే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన స‌ర్కారు వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి వీటిని ఇంప్లిమెంట్ చేసే అవ‌కాశం ఉంది. ఇది వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.