గాజువాకలో మంత్రికి గట్టి ఫైట్...!?
ఈ పరిణామాల నేపధ్యంలో వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. ఆయన గాజువాక నుంచి ఫస్ట్ టైం బరిలోకి దిగుతున్నారు.
By: Tupaki Desk | 17 March 2024 8:49 AM GMTవిశాఖ జిల్లా గాజువాక సీటు ఎపుడూ హాట్ ఫేవరేట్ గానే ఉంటుంది. సీటు కు రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన 2019 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు. దాంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది.
ఇదిలా ఉంటే 2024లో కూడా పవన్ పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఈ సీటుని టీడీపీ తీసుకుంది. 2014లో ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన పల్లా శ్రీనివాసరావు మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన 2019లో పోటీ చేసి పవన్ ఒక వైపు జగన్ వేవ్ మరో వైపు ఉన్నా 56 వేల ఓట్లను సాధించారు.
ఇక పల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు గాజువాకలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు 2019లో ఆయన ఓటమి పాలు అయ్యారు అన్న సానుభూతి కూడా ఉంది. జనసేనతో పొత్తు వల్ల కాపు ఓట్లు కూడా కలసి వస్తాయని లెక్కలు ఉన్నాయి.
ఈ పరిణామాల నేపధ్యంలో వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. ఆయన గాజువాక నుంచి ఫస్ట్ టైం బరిలోకి దిగుతున్నారు. పల్లాకు రెండు సార్లు పోటీ చేసిన అనుభవం సొంత క్యాడర్ అన్నీ ఉన్నాయి. మంత్రి అమర్నాధ్ కి మాత్రం సొత్న నియోజకవర్గం గాజువాక అయినప్పటికీ అక్కడ వైసీపీ సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా ఐక్యంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక మరో వైపు చూస్తే మొత్తం ఉత్తరాంధ్రాలో యాదవులకు ఒక్క సీటు కూడా వైసీపీ ఇవ్వలేదు అన్న విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు ఇచ్చారు. ఈసారి మాత్రం ఆ సీటూ లేకుండా పోయింది. దాంతో విశాఖ జిల్లాలో ఉన్న యాదవుకు గుర్రు మీద ఉన్నారని అంటున్నారు. వారికి వైసీపీకి మేయర్ వీమ్మార్డీయే లాంటి కీలక పదవులు ఇచ్చింది కానీ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు అన్న అసంతృప్తి ఉంది అని అంటున్నారు.
దీనిని ఎంతవరకూ ఎదుర్కొంటారో చూడాలి.అదే విధంగా వారిని మచ్చిక చేసుకుని దారికి తెచ్చుకుంటే తప్ప విశాఖ జిల్లాలోని గాజువాక, భీమిలీ, విశాఖ తూర్పు సీట్లలో వారి మద్దతు పూర్తిగా దక్కదు అని అంటున్నారు. ఇక మంత్రి గుడివడ కూడా వారి మద్దతుని కూడగట్టుకోవాల్సి ఉంది. అదే విధంగా ఇప్పటిదాకా గాజువాక ఇంచార్జిగా ఉన్న కార్పోరేటర్ ఉరుకూటి చందు, ఆయన తండి సీనియర్ నేత అయిన ఉరుకూటి అప్పారావుల మద్దతుని కూడా తీసుకోవాల్సి ఉంది అని అంటున్నారు.
ఏది ఏమైనా గాజువాకలో గుడివాడ బాగా శ్రమించాల్సి ఉంది అని అంటున్నారు. ఈ విషయంలో కనుక ఏమైనా తేడా వస్తే ఇబ్బందే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.