Begin typing your search above and press return to search.

బీజేపీ బిక్కచచ్చే మాటను చెప్పిన ఫైర్ బ్రాండ్

ఫైర్ బ్రాండ్ కమ్ టీపీసీసీ రథసారధి రేవంత్ గురించి.. ఆయన మాటల్లోని పదును గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   20 Nov 2023 4:27 AM GMT
బీజేపీ బిక్కచచ్చే మాటను చెప్పిన ఫైర్ బ్రాండ్
X

ఫైర్ బ్రాండ్ కమ్ టీపీసీసీ రథసారధి రేవంత్ గురించి.. ఆయన మాటల్లోని పదును గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గడిచిన వారం రోజులుగా తన ప్రచారంలో దూకుడు పెంచిన రేవంత్.. ప్రత్యర్థుల విషయంలో అస్సలు వెనక్కి తగ్గట్లేదు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఓవైపు బీఆర్ఎస్.. మరోవైపు బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ప్రచారంలో హైలెట్ అవుతున్నారు. అధికార బీఆర్ఎస్ నుంచి ఐదారుగురు వరకు ప్రముఖులు ప్రచారం చేస్తూ.. తమను టార్గెట్ చేసే వారిపై విరుచుకుపడుతున్నారు.

అందుకు భిన్నంగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ మాదిరి నాలుగు వైపులా కమ్మేసి.. మాటలతో చుక్కలు చూపించలేని ఇబ్బందికర పరిస్థితి. ఎవరేమన్నా.. దానికి బలమైన కౌంటర్ ఇస్తున్న నేతగా నిలుస్తారు రేవంత్ రెడ్డి. ఒక సబ్జెక్టును మరో అంశంతో ఇంటర్ లింకు చేస్తూ సమయానికి తగ్గట్లుగా రియాక్టు కావటం కనిపిస్తుంది. తాజాగా ఆయన ఫోకస్ బీజేపీ మీద పడింది.

తాజాగా నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. గత ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో డిపాజింట్లు గల్లంతు కాగా.. తాజా ఎన్నికల్లో మాత్రం 110 స్థానాల్లో డిపాజింట్ కోల్పోవటం ఖాయమన్న షాకింగ్ జోస్యాన్ని వెల్లడించారు. డిపాజిట్లు కూడా రాని పార్టీకి చెందిన వారు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తారని ప్రశ్నించారు. అంతేకాదు.. బీజేపీపై మాటల దాడిని కంటిన్యూ చేస్తూ.. పది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే.. ఒకరు మాత్రమే ఓబీసీ ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నట్లుగా చెప్పారు.

బీసీ గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినా పట్టించుకోని బీజేపీ.. బీసీని ముఖ్యమంత్రిని ఆ పార్టీ ఎలా చేస్తుంది? అంటూ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అయితే.. రాష్ట్రం మొత్తమ్మీదా రైతులకు కేవలం 8-10 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని చెప్పారు. కావాలంటే.. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం పరిధిలోని సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి పుస్తకాల్ని చెక్ చేస్తే.. అసలు నిజాలు తన్నుకుంటూ బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. రేవంత్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు షాకిచ్చేలా మారాయి.