Begin typing your search above and press return to search.

అడుగుకు రూ.500 అంటూ కేటీఆర్ ట్వీట్ కు ఉతికేసిన రేవంత్ కౌంటర్ ట్వీట్

టచ్ చేసి తిట్టించుకోవటం ఏమిటి కేటీఆర్.. అడుగుకు రూ.500పై ఉతికేసిన రేవంత్

By:  Tupaki Desk   |   1 Oct 2023 6:04 AM GMT
అడుగుకు రూ.500 అంటూ కేటీఆర్ ట్వీట్ కు ఉతికేసిన రేవంత్ కౌంటర్ ట్వీట్
X

అనటం ఎందుకు? రెట్టింపు మాటల్ని అనిపించుకోవటం ఏందుకు? ప్రజలు పెద్దగా పట్టించుకోని విషయాల్ని ప్రస్తావించి.. దిమ్మ తిరిగే కౌంటర్లను ఫేస్ చేసే విచిత్రమైన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రత్యర్థులకు దిమ్మ తిరిగిపోయేలా చేయటం మానేసి.. రివర్సులో పెద్ద ఎత్తున తిట్లు తింటున్న వైనం కేటీఆర్ మాటల్లో కనిపిస్తోంది.

తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. ఎన్నికల వేడి అంతకంతకూ పెరిగిపోతున్న తెలంగాణలో తాజాగా మంత్రి కేటీఆర్ తీవ్రమైన ట్వీట్ ఒకటి చేశారు. కాంగ్రెస్ పార్టీది కుంభకోణాల చరిత్ర అంటూ స్కాంగ్రెస్ అంటూ అభివర్ణిస్తూ.. ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ కు ఇచ్చేందుకు కర్ణాటక సర్కారు బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకు రూ.500 చొప్పున ట్యాక్స్ విధిస్తోందంటూ తీవ్రమైన ఆరోపణల్ని చేశారు మంత్రి కేటీఆర్.

పాత అలవాట్లు త్వరగా పోవన్న ఆయన.. స్కామ్ లు చేయటం గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ కు ఉన్న గొప్ప వారసత్వమన్న ఆయన ఎద్దేవాకు.. దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి. పక్క రాష్ట్రంపై గాలి మాటలు పక్కన పెట్టి తెలంగాణలో కల్వకుంట్ల స్కామ్ లీ చేసిన స్కామ్ ల గురించి చెప్పు.. నిండా అవినీతిలో మునిగి.. నిద్రలో కూడా కమిషన్లగురించి మాట్లాడేవారా? కాంగ్రెస్ ను విమర్శించేదంటూ నిప్పులు చెరిగారు.

దళిత బంధులో ముప్ఫై శాతం కమీషన్లు దండుకుంటున్నారని మీ నాన్న కేసీఆరే ఒప్పుకొన్నాడన్న రేవంత్.. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో నీ చెల్లి కవిత రూ.300 కోట్లు వెనకేసుకున్నదని దేశమంతా చెప్పుకొంటున్నది. భూములు లిక్కర్ అమ్మితే తప్పించి తెలంగాణలో పాలన నడుస్తలేదంటూ కాగ్ కడిగేసింది. ఈ విషయాల గురించీ చెప్పంటూ కౌంటర్ ట్వీట్ తో నిలదీశారు రేవంత్. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ భూముల్ని ఎన్ని ఎకరాలకు అమ్మింది? ఎన్ని ఎకరాలను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టింది? ఎంతమంది బినామీ బిల్డర్లతో హైదరాబాద్ లో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నది? ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు ఆ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నదీ తాములెక్కలతో సహా తేలుస్తామంటూ నిప్పులు చెరిగారు రేవంత్.

కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యారెంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే.. కొడుక్కి మతి చెడిందన్న రేవంత్ ఘాటు వ్యాఖ్యలు.. మంత్రి కేటీఆర్ ట్వీట్ నుంచి వచ్చిన చదరపుఅడుక్కి రూ.500 ఆరోపణలు తేలిపోయేలా చేశాయంటున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ప్రస్తావిస్తూ.. అనటం ఎందుకు అందుకు రెట్టింపు మాటల్ని అనిపించుకుంటూ.. మర్చిపోయిన చాలా విషయాల్ని గుర్తుకు తెచ్చేలా చేస్తున్న కేటీఆర్ తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.