Begin typing your search above and press return to search.

"కుమారీ ఆంటీకి ఒక న్యాయం.. మాకో న్యాయమా?"

ఈ సమయంలో తాజాగా చేపట్టిన కొత్త చర్యలు కుమారీ ఆంటీ షాప్ ని టచ్ చేయలేదనే ఆరోపణలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Sep 2024 4:14 AM GMT
కుమారీ  ఆంటీకి ఒక న్యాయం.. మాకో న్యాయమా?
X

కొంతకాలం క్రితం స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ సెలబ్రెటీగా మారిన సంగతి తెలిసిందే! ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేశారు! తెలంగాణ సీఎం రేవంత్ ఆమె గురించి ప్రత్యేకంగా ప్రస్థావించారు! ఈ సమయంలో తాజాగా చేపట్టిన కొత్త చర్యలు కుమారీ ఆంటీ షాప్ ని టచ్ చేయలేదనే ఆరోపణలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

అవును... హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో ఎంతో మంది ఫుట్ పాత్ వ్యాపారుల వస్తువులను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జప్తు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ను టచ్ చేయలేందంటూ సరికొత్త ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

వివరాళ్లోకి వెళ్తే... రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలోని హోటల్ కోహినూర్ కు ఎదురుగా గత కొంతకాలంగా ఫుట్ పాత్ పై పదుల సంఖ్యలో ఫుడ్ స్టాల్స్, ఇతర దుకాణాలు వెలిశాయి. దీంతో... ఆ ప్రాంతంలో తీర్వంగా ట్రాఫిక్ జాం ఏర్పడుతుందనే ఆరోపణలు వినిపించాయి. ఈ సమయంలో ఈ దుకాణాలు తొలగించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని అంటున్నారు.

అయినప్పటికీ వ్యాపారులు స్పందించలేదనేది ఒకవైపు నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది. దీంతో... రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. టీఎస్ ఐఐసీ అధికారుల సాయంతో ఫుట్ పాత్ పై వెలిసిన దుకాణాలను తొలగించారు. అక్కడున్న సామాన్లను అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు.

ఇందులో భాగంగా... తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవకుండానే రాయదుర్గం పోలీసులు తమ సామాగ్రిని తీసుకెళ్లారని వారు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలోనే... అక్కడే ఫుట్ పాత్ పై హోటల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీకి షాప్ ని తొలగించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీకి ఒక న్యాయం.. మాకు మరో న్యాయమా అంటూ వారు ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని తెలుస్తోంది.

అయితే... ప్రభుత్వం ఫుట్ పాత్ లపై ఆక్రమణలను మాత్రమే తొలగించిందని.. కుమారీ ఆంటీ స్టాల్ ఫుట్ పాత్ కు కొంచెం దూరంలోనే ఉందని మరికొందరు చెబుతున్నారని అంటున్నారు.

మరోపక్క... ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్.టీ.ఎల్), సరస్సుల బఫర్ జోన్ లతో పాటు ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని స్టాళ్లు, నిర్మాణాలను తొలగించడమే తమ లక్ష్యం అని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు.