యాదాద్రి జిల్లాలో ఘోరం.. చెరువులోకి కారు దూసుకెళ్లి 5 గురు దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ విషాద ఉదంతంలో ఏకంగా ఐదుగురు యువకులు మరణించిన వైనం షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 7 Dec 2024 4:54 AM GMTఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ విషాద ఉదంతంలో ఏకంగా ఐదుగురు యువకులు మరణించిన వైనం షాకింగ్ గా మారింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. ఈ తెల్లవారుజామున (శనివారం) 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘోర యాక్సిడెంట్ చోటు చేసుకుంది.
ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారంతా ఎల్బీనగర్ లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష.. దినేశ్.. వంశీ.. బాలు.. వినయ్ గా గుర్తించారు. వీరి డెడ్ బాడీలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన వేళలోకారులో ఆరుగురుయువకులు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్న ఆరో యువకుడు (మణికంఠ యాదవ్) కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా 20-21 ఏళ్ల మధ్యలోనే ఉన్నట్లు చెబుతున్నారు. వీరంతా భూదాన్ పోచంపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగాచెబుతున్నారు.
శుక్రవారం రాత్రి వీరు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మద్యం మత్తులోనే ఈ పఘోర ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. చెరువులోకి కారు దూసుకెళ్లిన వైనాన్ని చూసినంతనే అక్కడి స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే వారు మరణించినట్లుగా గుర్తించారు. చేతికి అంది వచ్చిన కొడుకులు ఇలా ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న వైనంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.