Begin typing your search above and press return to search.

‘ప్రైవేట్’ గా ఉన్న వారిని చూసి బాలిక తండ్రి.. కట్ చేస్తే ఊహించని విషాదం

అనూహ్య పరిణామాలు.. చిత్ర విచిత్రమైన నేర ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే వరంగల్ లో చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   29 Jan 2025 5:34 AM GMT
‘ప్రైవేట్’ గా ఉన్న వారిని చూసి బాలిక తండ్రి.. కట్ చేస్తే ఊహించని విషాదం
X

అనూహ్య పరిణామాలు.. చిత్ర విచిత్రమైన నేర ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే వరంగల్ లో చోటు చేసుకుంది. షాకింగ్ గా మారిన ఈ ఘటనలోకి వెళితే.. వరంగల్ నగరంలోని భాగమైన హనుమకొండలో ఈ దారుణం చోటు చేసుకుంది. నగర శివారు ప్రాంతానికి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే బాలిక వరంగల్ ప్రాంతానికి చెందిన ఒక బాలుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది.

మంగళవారం ఇంట్లో ఎవరూ లేరని.. అతడ్ని ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అలా వచ్చిన వేళ.. వారిద్దరూ ప్రైవేటుగా ఉన్న సమయంలో ప్రైవేటు ఉద్యోగి అయిన తండ్రి ఇంటికి వచ్చాడు. కూతురితో సన్నిహితంగా ఉన్న ఆ బాలుడి గొంతును కత్తితో కోశాడు. దీంతో భయాందోళనలకు గురైన బాలుడు హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీయగా.. అతడి వెంట పడ్డాడు ఆ బాలిక తండ్రి.

దీంతో.. ఆందోళనకు గురైన సదరు బాలిక ఇంటి తలుపులు వేసుకున్న బాలిక.. ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తండ్రి. తలుపు కొట్టగా గడియ వేసి ఉండటంతో స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా.. అప్పటికే ఆమె మరణించింది. దీంతో ఆ తండ్రి గుండెలు అవిసేలా రోదించటం అక్కడి వారిని తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. మరోవైపు బాలిక తండ్రి కత్తి పోటుకు గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వైనంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.