Begin typing your search above and press return to search.

ఏపీలో ట్రాన్స్ జెండర్ హత్య... తెరపైకి పోలీసుల సంచలన విషయాలు!

ఇక, ఈ హత్య కేసులో 15 మంది ప్రమేయం ఉందని.. వీరిలో 12 మందిని అరెస్ట్ చేశామని అన్నారు.

By:  Tupaki Desk   |   1 Dec 2024 12:22 PM GMT
ఏపీలో ట్రాన్స్  జెండర్  హత్య... తెరపైకి పోలీసుల సంచలన విషయాలు!
X

నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన ట్రాన్స్ జెండర్ హత్య తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గత నెల 26న జరిగిన ఈ దారుణ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సమయంలో.. ఈ హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగాణాలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా పోలీసులు ఈ హత్య కేసును ఛేదించారు.

అవును... నెల్లూరు జిల్లాలో గత నెలలో జరిగిన ట్రాన్స్ జెండర్ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఈ హత్యకు గల కారణాలను వెల్లడించారు. ఇందులో భాగంగంగా... ట్రాన్స్ జెండర్ల నాయకులు మధ్య ఆధిపత్యపోరే ఈ హత్యకు కారణమని ఎస్పీ వెల్లడించారు.

ఈ సందర్భంగా... ట్రాన్స్ జెండర్ల నాయకులు హాసిని, అలేఖ్యల మధ్య ఆధిపత్యపోరే హత్యకు కారణమని ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. ఇక, ఈ హత్య కేసులో 15 మంది ప్రమేయం ఉందని.. వీరిలో 12 మందిని అరెస్ట్ చేశామని అన్నారు. అయితే పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ఈ క్రమంలో... ఈ హత్యకేసులో ప్రమేయం ఉన్నవారిపై తిరుపతి, నెల్లూరు జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. ప్రధానంగా ట్రాన్స్ జెండర్ నాయకులు హాసినికి సులోచన, షీలా అనే ట్రాన్స్ జెండర్లతోనే విభేదాలు ఉన్నాయని.. దీంతో, అలేఖ్య, సులోచన, షీలాలు కలిసి హాసినీని మరికొందరి సహాయంతో హత్య చేశారని తెలిపారు.

ఇందులో భాగంగా... కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఈ నెల 26న దారుణంగా హత్య చేయించారని ఎస్పీ తెలిపారు. ఈ హత్యలో పాల్గొన్న నిందితులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని.. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేధించామని ఎస్పీ చెప్పారు.