యూఎస్ సభలో ట్రాన్స్ జెండర్ ఏ బాత్ రూమ్ లోకి వెళ్లాలి?
అవును... క్యాపిటల్ భవనంలో మహిళల బాత్ రూమ్ వినియోగించుకునేందుకు సారా మెక్ బ్రైడ్ కు వీల్లేకుండా ఓ తీర్మానం తీసుకొచ్చేందుకు రిపబ్లికన్లు
By: Tupaki Desk | 20 Nov 2024 11:30 AM GMTఇటీవల అత్యంత ఆసక్తికరంగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... డెలవేర్ లోని ఎట్ లర్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ విజయం సాధించారు. దీంతో... కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎల్.జీ.బీ.టీ.క్యూ. జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తూ.. ఎన్నికల సమయంలో సుమారు 3 మిలియన్ డాలర్లకు పైగా ప్రచార విరాళాలు సేకరించి.. ఘన విజయం సాధించిన సారా.. వచ్చే ఏడాది జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే... క్యాపిటల్ భవనంలో ఆమె ఏ బాత్ రూమ్ వినియోగించుకోవాలి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... క్యాపిటల్ భవనంలో మహిళల బాత్ రూమ్ వినియోగించుకునేందుకు సారా మెక్ బ్రైడ్ కు వీల్లేకుండా ఓ తీర్మానం తీసుకొచ్చేందుకు రిపబ్లికన్లు సిద్ధమవుతున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. సంకుచిత మనస్థత్వాలు, వివక్ష చూపించే ఆలోచనలకు ఆగ్రరాజ్యం ప్రజలూ అతీతులు కాదన్నమాట అనే చర్చ తెరపైకి వచ్చింది.
ఇలా.. డెమోక్రటిక్ సభ్యురాలు, ట్రాన్స్ జెండర్ సారా మెక్ బ్రైడ్ ను మహిళల బాత్ రూమ్ లోకి అనుమతించబోమని రిపబ్లికన్లు చెబుతుండగా.. దీన్ని ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా సమర్ధించారని అంటున్నారు. పురుషులను స్త్రీల టాయిలెట్స్ లోకి అనుమతించబోమంటూ ఆయన తీర్మానంపై సంకేతాలిచ్చారట.
దక్షిణ కరోలినా నుంచి ఎన్నికైన రిపబ్లికన్ నేత నాన్సీ మేస్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే... ఈ చర్యను సారా మెక్ బ్రైడ్ తీవ్రంగా ఖండించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి వివాదాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
కాగా... ట్రాన్స్ జెండర్ల బాత్ రూమ్ ల విషయంలో అమెరికాలో గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళ బాత్ రూమ్ లను ట్రాన్స్ జెండర్ మహిళలు వినియోగించకుండా ఇప్పటికే 10కి పైగా రాష్ట్రాలు చట్టాలు తీసుకొచ్చాయి! దీంతో... సభా సమయంలో సారా ఏ బాత్ రూమ్ వినియోగించాలనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.