Begin typing your search above and press return to search.

అమ్మాయిఅబ్బాయిగా మారి.. ప్రేయసి ని పెళ్లాడాడు

జంట లోని ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిష్టర్డ్ వివాహానికి దరఖాస్తు చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   15 July 2023 9:56 AM GMT
అమ్మాయిఅబ్బాయిగా మారి.. ప్రేయసి ని పెళ్లాడాడు
X

సమాజం లో రానురాను పెను మార్పులు వస్తున్నాయి. ఒకనాడు స్త్రీ పురుషులు ఒకరినొకరు నేరుగా చూసుకునేందుకే జంకేవారు. తర్వాతి కాలం లో అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకున్నా బయట కు చెప్పలేకపోయేవారు. ఇలాంటి మౌన ప్రేమల పై ఎన్నో సినిమా కథలు వచ్చాయి. హిట్ సూపర్ హిట్ అయ్యాయి. అనంతర కాలం లో ప్రేమ ను బహిర్గతం చేయడమే కాదు పెద్దల ను ఎదిరించి పెళ్లి చేసుకునేంత వరకు వచ్చింది. ఇప్పుడైతే ఇక పరస్పరం ఇష్టపడితే చాలు.. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకోవడమే..? అంతేకాదు.. ఇలాంటి పరిచయాలు ఎక్కువ శాతం సోషల్ మీడియా వేదికగానే అవుతున్నాయి.

ప్రేమ వెర్రిపుంతలు..

స్త్రీ-పురుషుల మధ్య ప్రేమ చిగురించడం సహజం. కానీ ఇద్దరు పురుషుల మధ్యనో ఇద్దరు స్త్రీల మధ్యనో ప్రేమ పుట్టడం అనేది వెర్రిపుంతలు తొక్కుతున్న కల్చర్ కు నిదర్శనంగానే భావించాలి. ఇలాంటివి పెళ్లిదాకా వెళ్లిన ఉదాహరణలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఒకే జెండర్ వారు వివాహం చేసుకున్న ఘటనలు మీడియా లో కథలు కథలుగా వచ్చాయి.

లింగమార్పిడి చేసుకుని మరీ..

ఒకే జెండర్ వారు ప్రేమ లో పడడం అంటే.. కలి కాలం అని చెప్పుకొని సమాధానపడాలి. ఇలాంటివి విదేశాల్లో 20 30 ఏళ్ల కిందటే జరిగినా మన దేశం లో ఇటీవల వెలుగుచూస్తున్నాయి. ఇక ఏకంగా వారితో కలిసుండేందుకు లింగ మార్పిడి చేసుకోవడమే ఇక్కడ పెద్ద విచిత్రం. స్త్రీగా జన్మించిన వారు పురుషుడి గా మారడమో పురుషుడు స్త్రీగా మారడమో ఏదైతేనేం..? జెండర్ మార్చుకుంటున్నారు. ఇలాంటిదే ఉత్తరప్రదేశ్ లో ఓ ఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి ఏకంగా కోర్టునే ఆశ్రయించారు. పెళ్లికోసం వీరి లో ఒకరు లింగమార్పిడి కూడా చేసుకున్నారు. ఇదిగో.. మేం ఇప్పుడు ఒకే జెండర్ వారం కాదు అని చెప్పేందుకు లింగమార్పిడి అనంతరం మంజూరైన ధ్రువపత్రంతో సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్టర్డ్ వివాహానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు.

ఉద్యోగం లో చిగురించిన ప్రేమ..

పైన చెప్పిన ఘటన యూపీ లోని బరేలీ లో వెలుగు లోకి వచ్చింది. ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేస్తున్న ఈ ఇద్దరమ్మాయిల మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరి లో ఒకరు బరేలికి చెందినవారు కాగా.. మరొకరు బదాయీ వారు. ప్రేమ లో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నా కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో వారు కఠిన నిర్ణయం తీసుకున్నారు. జంట లోని ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిష్టర్డ్ వివాహానికి దరఖాస్తు చేసుకున్నారు. తద్వారా ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు.