Begin typing your search above and press return to search.

ట్రెండింగ్... గూగుల్ కు 1 పక్కన 36 సున్నాల డాలర్ల మొత్తం జరిమానా!

ఇందులో భాగంగా... టెక్ దిగ్గజం గూగుల్ కు రష్యాలోని మాస్కో కోర్టు ‘న భూతో న భవిష్యతి’ అనే స్థాయిలో భారీ షాకిచ్చింది.

By:  Tupaki Desk   |   31 Oct 2024 4:02 AM
ట్రెండింగ్... గూగుల్  కు 1 పక్కన 36 సున్నాల డాలర్ల మొత్తం జరిమానా!
X

తాజాగా ఓ అనూహ్య ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... టెక్ దిగ్గజం గూగుల్ కు రష్యాలోని మాస్కో కోర్టు ‘న భూతో న భవిష్యతి’ అనే స్థాయిలో భారీ షాకిచ్చింది. ఇందులో భాగంగా... ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం మొత్త ప్రపంచ జీడీపీ 100 ట్రిలియన్ డాలర్లను మించిన మొత్తాన్ని జరిమానాగా విధించింది!

అవును... తమ దేశ యూట్యూబ్ ఛానల్స్ పై వేటు వేసినందుకు గూగుల్ కు 2 అన్ డెసిలియన్ రష్యన్ రూబుళ్ల భారీ జరిమానా విధించింది మాస్కో కోర్టు. అంటే... 2.5 డెసిలియన్ అమెరికా డాలర్లు! మరింత సవివరంగా చెప్పాలంటే... ఒక అన్ డెసిలియన్ అంటే... 1 తర్వాత 36 సున్నాలు ఉంటాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే... ఈ భూమిపై చలామణిలో ఉన్న మొత్తం నగదు కంటే ఎక్కువన్నమాట! అయితే... రష్యన్ కోర్టులు ఇచ్చే తీర్పుల ప్రభావాన్ని ముందే ఊహించిందో ఏమో కానీ... ఈ విషయంలో గూగుల్ ముందుగానే జాగ్రత్త పడింది. రష్యన్ టీవీ ఛానల్స్ యజమానులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ కోర్టులో పిటిషన్స్ చేసింది.

కాగా... 2020 నుంచి ఇప్పటివరకూ రష్యా ప్రభుత్వ అధికార మీడియా సహా 17 ఛానల్స్ ను యూట్యూబ్ నిలిపేసింది. ఈ ఛానల్స్ ను పునరుద్ధరించాలని మాస్కో కోర్టు ఆదేశించినా గూగుల్ నిరాకరించింది. దీంతో.. రోజువారీ జరిమానా విధించింది!

ఈ సందర్భంగా స్పందించిన లాయర్ ఇవాన్ మ్రోజోవ్... ఈ ఛానల్స్ ను తొలగించడం కోసం అడ్మినిస్ట్రేటివ్ నేరాల కోడ్ ఆర్టికల్ 13.41 ప్రకారం కోర్టు గూగుల్ ని జవాబుదారీగా ఉంచిందని వివరించింది. ఆ ఛానల్స్ ని పునరుద్ధరించాలని తీర్పు ఇచ్చినా అది జరగలేదు. దీంతో.. రోజువారీ జరిమానా విధించిందని తెలిపారు.

ఇందులో భాగంగా... రోజువారీ జరిమానాను 1,00,000 రూబిళ్లు ($1,025)గా నిర్ణయించబడింది. అయితే.. ఇది చక్రవడ్డీ కారణంగా ప్రతీ వారం రెట్టింపు అవుతుందని అన్నారు.