Begin typing your search above and press return to search.

మీడియా ట్రెండింగ్... రాజ్ తరుణ్ అవుట్, దువ్వాడ ఇన్!

దువ్వాడ శ్రీనివాస్ ను మాధురి అనే మహిళ ట్రాప్ చేసిందంటూ ఆయన భార్య వాణి, కుమార్తెలు ఆరోపించడంతో గత రెండు మూడు రోజులుగా ఈ విషయం మీడియాలో ట్రెండింగ్ కి చేరుకుంది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 5:31 AM GMT
మీడియా ట్రెండింగ్... రాజ్  తరుణ్  అవుట్, దువ్వాడ ఇన్!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మీడియా హౌస్ లు ఉన్నాయి! అయితే వాటి అదృష్టమో.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి దురదృష్టమో తెలియదు కానీ.. ఏదో ఒక రకంగా మీడియాకు ఫుల్ మీల్స్ దొరికే ట్రెండింగ్ విషయాలు దొరుకుతున్నాయనే కామెంట్లు మీడియా సర్కిల్స్ లోనే వినిపిస్తున్నాయి! ఈ సమయంలో రెండు విషయాలపై చర్చ జరుగుతుంది.

అవును... నిన్న మొన్నటి వరకూ రెండు రాష్ట్రాల్లోని మీడియాలో రాజ్ తరుణ్ వ్యవహారం ట్రెండింగ్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా.. తామిద్దరం కొన్నేళ్లపాటు సహజీవనం చేశామని, ఆ తర్వాత రహస్య వివాహం కూడా చేసుకున్నామని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే... ఇప్పుడు మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ తనని పట్టించుకొవడం లేదని ఆమె ఆరోపించింది. దీంతో... రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా అతడికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరైంది.

దీంతో రాజ్ తరుణ్ వ్యవహారం ట్రెండింగ్ నుండి సైడ్ తీసుకుందని అంటున్నారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రమ్ తెరపైకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ను మాధురి అనే మహిళ ట్రాప్ చేసిందంటూ ఆయన భార్య వాణి, కుమార్తెలు ఆరోపించడంతో గత రెండు మూడు రోజులుగా ఈ విషయం మీడియాలో ట్రెండింగ్ కి చేరుకుంది.

ఈ సందర్భంగా... తనదో విచిత్రమైన కథ అని, దానికి విడాకులతోనే ముగింపు అని దువ్వాడ వెల్లడించేవరకూ వ్యవహారం వచ్చింది! మరోవైపు... తమది అడల్టరీ సంబంధం అని మాధురి కన్ క్లూజన్ ఇచ్చారు. ఇంకోవైపు.. దువ్వాడ శ్రీనివాస్ ను ఆమె ట్రాప్ చేసిందంటూ ఆమె అతడితో చేసిన వాట్సప్ ఛాట్ లు బయట పెడుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు.

దీంతో... ఇప్పుడు ఈ విషయమే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మీడియాలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై అటు దువ్వాడ శ్రీను, ఇటు ఆయన భార్య కుమార్తెలు, మరోవైపు మాధురీ అనే మహిళ వరుసగా మీడియా ముందుకు వస్తున్నారు! దీంతో... మరికొన్ని రోజులు ఈ విషయమే ట్రెండింగ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో కొత్త విషయం తెరపైకి వచ్చేవరకూ!!

మరోపక్క దువ్వాడ ఇష్యూని అటు పొలిటికల్, ఇటు హ్యూమన్ ఇంట్రస్టింగ్ టాపిక్ గా పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో.. ఓ వైపు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ విజయం కోసం జగన్ పెడుతున్న వరుస మీటింగ్ లు, మరోవైపు ఏపీలో జరుగుతున్న దాడుల్లో బాధితులుగా మిగిలినవారిని పరామర్శిస్తూ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు కూడా నెక్స్ట్ ప్లేస్ కి వెళ్లిపోయాయని చెబుతున్నారు.

ఇదే క్రమంలో నంద్యాలలో జగన్ పరామర్శ కూడా హైలెట్ కాలేదని.. సోషల్ మీడియాలో కూడా ఈ విషయాలు వెనుకబడ్డాయని చెబుతున్నారు. ఇలా ప్రస్తుతం ఎంత సీరియస్ పాలిటిక్స్ జరుగుతున్నప్పటికీ అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారమే ట్రెండింగ్ లో కొనసాగుతోందనేది బిగ్ ఇష్యూగా ఉంది!