Begin typing your search above and press return to search.

జాతర వేళ 2.5కేజీల నువ్వులనూనె తాగేసింది

ఒక అదీవాసీ మహిళ ఏకంగా రెండున్నర కేజీల నువ్వులనూనె తాగేసిన వైనం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:18 AM GMT
జాతర వేళ 2.5కేజీల నువ్వులనూనె తాగేసింది
X

లీటరు మంచినీళ్ల సీసాను తీసుకొని.. ఒకేసారి ఎన్ని నీళ్లు తాగగలం? చాలామంది పావులీటరు వరకు తాగేస్తారు. కొందరు అరలీటరును హాంఫట్ చేసేస్తారు. కానీ.. ఒకే దఫాలో లీటరు మంచినీళ్లు తాగేటోళ్లు చాలా తక్కువగా ఉంటారు. నిజానికి నీళ్లు తాగేందుకే ఇలాంటి తిప్పలు అయితే...తాజాగా వెలుగు చూసిన ఉదంతం గురించి విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. విస్మయానికి గురి కాక తప్పదు.

ఇంతకూ అదేమంటే.. తమ ప్రాంతంలో జరిగే జాతరలో భాగంగా తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకోవటానికి ఒక అదీవాసీ మహిళ ఏకంగా రెండున్నర కేజీల నువ్వులనూనె తాగేసిన వైనం సంచలనంగా మారింది. దీనికి ఆదిలాబాద్ జిల్లా వేదికైంది. ఈ జిల్లాలోని నార్నూర్ మండల కేంద్రంలోతొడసం వంశస్థుల ఆరాధ్య దైవం ఖాందేవుని జాతర. ప్రతి ఏడాది జనవరిలో ఈ వేడుకను భారీగా నిర్వహిస్తుంటారు.

ఈ జాతరలో పాల్గొనటం కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల వారు మాత్రమే కాదు మహారాష్ట్ర.. జార్ఖండ్.. ఛత్తీస్ గఢ్.. మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జనాలు వస్తారు. ఈ జాతర ఆరంభంలో తొడసం వంశానికి చెందిన ఆడబిడ్డ నాగుబాయి చందు రెండున్నర కిలోల నువ్వులనూనెను తాగి మొక్కు తీర్చుకుంది.

తొడసం వంశస్థుల ఇళ్ల నుంచి ఈ నూనెను పూజకు పంపుతారు.అనంతరం తొలి ఆడబిడ్డ ఇంత భారీగా నువ్వులనూనెను తాగేయటం ద్వారా మొక్కును కంప్లీట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.