Begin typing your search above and press return to search.

అన్న కొడుకు పెళ్లిలో అనిల్ అంబానీ... ట్రోల్స్ అవసరమా?

ఇందులో భాగంగా తన లగేజ్ తానే మోసుకుంటూ వచ్చారని.. అనామకుడిలా వచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 March 2024 10:20 AM GMT
అన్న కొడుకు పెళ్లిలో అనిల్  అంబానీ... ట్రోల్స్  అవసరమా?
X

గతకొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడి పెళ్లి అవ్వడంతో పాటు ఆ వేడుకకు వచ్చిన అతిరథ మహారథుల జాబితాతో పాటు ఎంటర్ టైన్మెంట్ కోణంలో చూసినా.. బెస్ట్ ఎంటర్ టైనర్స్ తో ఈ వేడుక ఆధ్యాంతం నెట్టింట వైరల్ గా మారింది.

గుజరాత్ లోని జాంనగర్ వేదికగా మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగిన ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణకు.. హాజరైన అతిథులు కూడా ఒక ప్రధాన కారణం అనేది తెలిసిన విషయమే. ఇందులో భాగంగా... బిల్ గేట్స్, మాక్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్ వంటి వారితో పాటు ఇంటర్నేషనల్ ఎంటర్ టైనర్స్ రిహన్నా, మిజిషియన్ డేవిడ్ బ్లెయిన్ ల ఎంట్రీతో ఇది వరల్డ్ వైడ్ మరింత చర్చనీయాంశం అయ్యిందనే భావించాలి.

ఇక ప్రముఖ గాయకుడు బీ ప్రాక్, అర్జిత్ సింగ్, అజయ్ - అతుల్, దిజిలిత్ దోశాంక వంటి టాప్ సింగర్స్ తో పాటు సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని లు హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక బాలీవుడ్ స్టార్స్ మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి హాజరు.. అనంతరం వారి పెర్ఫార్మెన్స్ తో కలిగించిన హుషారు ఆ వేడుకలకు మరింత ఆకర్షణను కలిగించాయని చెప్పొచ్చు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ బ్రదర్.. అనీల్ అంబానీ తన ఫ్యామిలీ మెంబర్స్ తో హాజరయ్యారు. ఇందులో భాగంగా అనిల్ భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్, జై అన్షుల్ లు ఎంట్రీ ఇచ్చారు. అయితే... ఈ సందర్భంగా అనీల్ ఫ్యామిలీని పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తన లగేజ్ తానే మోసుకుంటూ వచ్చారని.. అనామకుడిలా వచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఆ వేడుకకు హాజరైన అతిరథ మహారథులంతా ఎవరి లగేజ్ లను వారే తెచ్చుకున్నారు! పైగా... చాలా మంది సక్సెస్ ఫుల్ పీపుల్ సింపుల్ సిటీని కోరుకుంటారని చెబుతుంటారు. ఇక అనామకుడిలా ఎంట్రీ ఇచ్చారంటూ వస్తున్న కామెంట్స్ కూడా ఖండించదగినవే అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

అందుకు కారణం... అనామకులు అయిన వారికి ఈ వేడుకల్లో ఆహ్వానం దక్కదు!! అలా అని ఆహ్వానం దక్కనివారంతా అనామకులు అని కాదు కానీ... వచ్చినవారిలో అలాంటివారు మాత్రం ఉండరని భావించొచ్చు!! ఈ విషయం మరిచిన పలువురు నెటిజన్లు... అనిల్ అంబానీ & ఫ్యామిలీని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇది ఏమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి అనిల్ అంబానీని పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఇటీవల కాలంలో ఆయన రెగ్యులర్ కారులో కనిపించే సరికి ఆ విషయాన్ని నెటిజన్లు ట్రోల్స్ చేశారు. ఒకప్పుడు కోట్ల విలువ చేసే కార్లలో తిరిగిన ఆయన ఇప్పుడు 40 - 50 లక్షల విలువైన కార్లలో తిరుగున్నారని ఎద్దేవా చేశారు. ఇది మధ్య తరగతికి గొప్ప కారే కానీ.. అంబానీ కుమారుడికి కాదని కామెంట్స్ పెట్టారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... జీవితంలో ఎంతటివారికైనా ఎగుడు దిగుడులు అత్యంత సహజం. నిన్నమొన్నటి వరకూ షేర్ ఆటోలో కనిపించినవారు ఇప్పుడు అత్యంత ఖరీదైన కార్లలో విత్ డ్రైవర్ కనిపించొచ్చు... నిన్నమొన్నటివరకూ ప్యాలెస్ లలో ఉన్నవారు డబుల్ బెడ్ రూం అద్దె ఇంటిలోనూ దర్శనమివ్వొచ్చు. అదంతా కాలమహిమ.. విది ఆడే నాటకంగా చూడాలే తప్ప... వాటిని చూపిస్తూ ట్రోల్స్ చేయకూడదనేది పలువురి అభిప్రాయంగా ఉంది!!