అక్కడే తిరిగి సభ పెడుతున్న ట్రంప్.. రిస్క్ అవుతుందేమో?
అయితే ఎక్కడైతే కాల్పులు జరిగాయో అక్కడే తాజాగా ట్రంప్ మరొక సభలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 4 Oct 2024 7:30 PM GMTవచ్చేనెల అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి గట్టిగా కనిపిస్తోంది. ఈసారి గెలవాలి అనే గట్టి ధీమాతో ట్రంప్ తన అడుగులు ముందుకు వేస్తున్నారు. జూలైలో పెన్సిల్వేనియాలోని ప్రచార సభలో అమెరికా మాజీ అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎక్కడైతే కాల్పులు జరిగాయో అక్కడే తాజాగా ట్రంప్ మరొక సభలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సభకు తాను హాజరు కాబోతున్నట్టుగా ఎలాన్ మస్క్ కూడా పేర్కొనడం విశేషం. తన ఎక్స్ ఖాతాలో డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ 'ఐ యామ్ కమింగ్ బ్యాక్ టు బట్లర్’అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు స్పందించిన ఎలాన్ మస్క్ 'నేను మీకు మద్దతుగా అక్కడ ఉంటాను’అంటూ సమాధానమిచ్చారు. అయితే ప్రస్తుతం బట్లర్లో ట్రంప్ సంచారం పై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత జులై నెలలో ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్లో ప్రచార సభ నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆయనపై థామస్ మాథ్యూ క్రూక్స్ అనే ఓ యువకుడు కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ట్రంప్ కుడిచేవి పైభాగం నుంచి తూటా దూసుకుపోవడంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పింది. ఈ విషయం జరిగినప్పుడు వేగంగా స్పందించిన అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్ ను కాపాడడంలో సక్సెస్ఫుల్ అయింది.
అయితే కాల్పుల తర్వాత ఎక్కడైతే తనపై కాల్పులు జరిగాయో అదే చోట ర్యాలీ నిర్వహిస్తాను అని గతంలో ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అక్కడే ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఫ్లోరిడాలోని వెస్ట్ పామీచీ లో గోల్ పాడుతున్న సమయంలో కూడా ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఫెన్సింగ్ దగ్గర నుంచి నిందితుడు తుపాకీతో రావడానికి గమనించిన భద్రతా దళాలు అతనిపై కాల్పులు జరపడంతో పాటు అదుపులోకి కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ పై మరొకసారి హత్యాయత్నం జరిగే అవకాశం ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు. అయితే ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ ని కొందరు సమర్థిస్తున్నారు.