Begin typing your search above and press return to search.

రెండు వేల మందికి షాకిచ్చిన ట్రంప్... మిగిలినవారిని ఫోర్స్ చేస్తున్నారంట!

ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ట్రంప్ వైఖరి తీవ్ర వివాదాస్పదమవుతుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 9:30 AM GMT
రెండు వేల మందికి షాకిచ్చిన ట్రంప్... మిగిలినవారిని ఫోర్స్  చేస్తున్నారంట!
X

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలనే కాదు స్వదేశీ ప్రజానికాన్ని ఇబ్బందులు పెడుతున్నారనే చర్చ మొదలైందని అంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ట్రంప్ వైఖరి తీవ్ర వివాదాస్పదమవుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో రెండు వేల మంది ఉద్యోగులకు ట్రంప్ షాకిచ్చారు.

అవును... రెండు వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. ఇదే సమయంలో.. మిగిలినవారిలో కొంతమందిని మినహాయించి.. మిగతా వేల మంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వెబ్ సైట్ లోని నోటీసు ద్వారా తెలుస్తోందని చెబుతున్నారు.

వాస్తవానికి తమ ఉద్యోగాలు తొలగింపుకు ముందే ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల్ నికోలస్ తిరస్కరించారు. ఇలా ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాతే ట్రంప్ యంత్రాంగం ఈ విషయం ముందుకెళ్లినట్లు చెబుతున్నారు.

దీంతో... మిగిలిన ఉద్యోగుల్లోనూ భయాందోళనలు మొదలైనట్లు చెబుతున్నారు. వాస్తవానికి డోజ్ సారథిగా ఎలాన్ మస్క్ ముందున్న బిగ్ టాస్క్ ఇదేనని చెబుతున్నారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికే ఎలాన్ మస్క్ పనిచేస్తున్నారు. దీంతో... ముందు ముందు మరిన్ని సంచలన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి డోజ్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో యూఎస్ ఎయిడ్ పై మస్క్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. యూఎస్ ఎయిడ్ ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని.. అది నేరగాళ్ల సంస్థ అని మస్క్ ఆరోపించారు. అందువల్లే దానికి నిధులను ఆపేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది.

ఇందులో భాగంగానే 600 మంది ఉద్యోగులను ఆఫీస్ లోకి వెళ్లకుండా నిలిపేశారు. అయితే... ఈ చర్యపై ఫెడరల్ జడ్జి అమీర్ అలీ తాత్కాలికంగా స్టే ఇచ్చారు. యూఎస్ ఎయిడ్ ద్వారా సాయం అందించడానికి అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఆమోదం తెలిపినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా నిపేయగలదని జడ్జి నిలదీసిన పరిస్థితి. అయినప్పటికీ ట్రంప్ తన చర్యలను సమర్ధించు కుంటున్నారు.

కాగా... అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు, మానవతా దృష్టితో సహాయానికీ యూఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా అందుతున్న నిధులను ట్రంప్ సర్కార్ ఆపేసిన సంగతి తెలిసిందే.