Begin typing your search above and press return to search.

వారందరికి లేఆఫ్ లు ఇచ్చి షాకిచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక అయ్యేందుకు భారీ యుద్ధాన్నే చేసిన ట్రంప్..ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆర్నెల్ల వరకు పదవీ బాధ్యతలు చేపట్టేందుకు వెయిట్ చేయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Jan 2025 4:56 AM GMT
వారందరికి లేఆఫ్ లు ఇచ్చి షాకిచ్చిన ట్రంప్
X

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక అయ్యేందుకు భారీ యుద్ధాన్నే చేసిన ట్రంప్..ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆర్నెల్ల వరకు పదవీ బాధ్యతలు చేపట్టేందుకు వెయిట్ చేయటం తెలిసిందే. అమెరికా నిబంధనలకు అనుగుణంగా ఆయన వెయిట్ చేసినప్పటికీ.. తాను అధికారం చేపట్టిన క్షణం నుంచి తానేం చేయాలనుకున్నానో.. అవన్నీ చేసేందుకు వీలుగా పక్కా గ్రౌండ్ ను సిద్ధం చేసుకున్నారు ట్రంప్. అందుకు తగ్గట్లే.. అధికారం చేతికి వచ్చినప్పటికి నుంచి మహా దూకుడుగా నిర్ణయాల్ని తీసేసుకుంటున్నారు.

గత అధ్యక్షుడు జోబైడెన్ ఇచ్చిన 78 ఆదేశాల్ని రద్దు చేయటమే కాదు.. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసిన ట్రంప్.. తాజాగా మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ.. ఈక్విటీ..ఇన్ క్లూజిన్ సిబ్బంది అందరికి లేఆఫ్ లు ఇచ్చేందుకు రెఢీ అయ్యారు.

వారందరిని సెలవులోఉంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక మోమోను సిద్ధం చేసి విడుదల చేశారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ.. ఇన్ క్లూజిన్ ప్రోగ్రాంలను నిర్వీర్యం చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం డైవర్సిటీ.. ఈక్విటీ.. ఇన్ క్లూజన్ సిబ్బంది అందరిని అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోపు వేతనంతో కూడిన సెలవుపై పంపాలని డిసైడ్ చేశారు.

అంతేకాదు.. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్ పేజీలను గడువు లోపు తొలగించాయని స్పష్టం చేశారు. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాల్ని సైతం రద్దు చేసుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లను తొలగించారు.వచ్చే శుక్రవారం నాటికి వీరికి లేఆఫ్ లు ఇచ్చేసి ఫెడరల్ సిబ్బంది సంఖ్యలోనూ కోత విధించాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. అయితే.. దీని ప్రభావం ఎంతమీద పడుతుందన్న దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.