'జన్మతః పౌరసత్వం రద్దు'... కోర్టుతో ట్రంప్ కు షాకిచ్చిన ఐదుగురు గర్భిణీ స్త్రీలు!
అవును... జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Jan 2025 4:00 AM GMTడొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వలసదారులకు, ప్రధానంగా అమెరికాలో ఉన్న భారతీయులకు ఇచ్చిన ఫస్ట్ బిగ్ షాక్... "జన్మతః పౌరసత్వం రద్దు" ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ. దీనిపై ఇంటా బయటా ట్రంప్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో కోర్టు ట్రంప్ కు షాక్ ఇచ్చింది. వలసదారులకు గుడ్ న్యూస్ చెప్పింది!
అవును... జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మిగిలినవి అన్నీ ఒకెత్తు అయితే అమెరికాలో ఉన్న వలసదారులను తీవ్రంగా టెన్షన్ పెట్టే జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో... ఒక్కసారిగా వలస సమాజం.. ప్రధానంగా అమెరికాలోని భారతీయ సమాజం టెన్షన్ పడిపోయింది. ఈ సమయంలో... ఈ నిర్ణయంపై ఐదుగురు గర్భిణీ స్త్రీలు, అనేక వలస సంఘాలతో పాటు డెమోక్రాట్ ల నేతృత్వంలోని 22 రాష్ట్రాలూ రెండు పిటిషన్స్ ని కోర్టులో వేశాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదనలు వినిపించాయి.
అదేవిధంగా... అమెరికాలో పుట్టిన ఎవరికైనా జన్మతః పౌరసత్వం లభించడం వారి హక్కు అని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. ఇదే సమయంలో... జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ట్రంప్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కొంతమంది ఆశ్రయం కోరేవారికి జన్మించిన శిశువులను "స్టేట్ లెస్" గా మార్చగలదని హెచ్చరించారు.
దీంతో... సియటిల్ జిల్లా న్యాయమూర్తి జాన్ కఫ్నర్... ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులు 14 రోజులపాటు అమలులోకి రాకుండా అడ్డుకున్నారు!
తగ్గేదేలే అంటున్న ట్రంప్!:
ఇలా తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం జారీ చేసిన అత్యంత కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో ఒకటైన జన్మతః పౌరసత్వం రద్దు ఉత్తర్వ్యులను సియటెల్ కోర్టు 14 రోజుల పాటు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ స్పందించారని అంటున్నారు. ఇందులో భాగంగా... జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేతపై అప్పీల్ కు వెళ్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
గర్భవతులకు ఇకపై నో టెన్షన్!:
అమెరికాలో పుట్టిన పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వ హక్కు ఫిబ్రవరి 20 తర్వాత లభించదంటూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్.. వలసదారులను తీవ్రంగా టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా గర్భవతులైన మహిళలను మరింత పెట్టిందనే చర్చ జరిగింది.
ఈ క్రమంలో... చాలా మంది గర్భవతులైన మహిళలు, అందులోనూ 8 - 9 నెలల గర్భిణీలు ఆస్పత్రులకు క్యూ కట్టారని.. ఫిబ్రవరి 20 లోపు తమకు డెలివరీ చేయాలని.. సీ-సెక్షన్ ద్వారా ప్రసవాలు చేయాలని వైద్యులను అభ్యర్థించినట్లు కథనాలొచ్చాయి. ఈ విషయం అటు అమెరికాలోని డాక్టర్స్ ని కూడా టెన్షన్ పెట్టిందని అంటున్నారు.
ఈ సమయంలో... ట్రంప్ ఇచ్చిన జన్మతః పౌరసత్వం రద్దు ఉత్తర్వ్యులను సియాటిల్ కోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో.. ఇకపై అటు గర్భిణీలకు, ఇటు వైద్యులకు కూడా చాలా రిలాక్స్ న్యూస్ అని అంటున్నారు. ఈ విషయంలో ఎవరూ ప్రస్తుతానికి అందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఇదే క్రమంలో... ఈ తాత్కాలిక ఉపశమనం, శాస్వతం కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ప్రార్థిస్తున్నారు.