Begin typing your search above and press return to search.

ఎఫ్-35 పై మస్క్ మాటలు... మోడీని ట్రంప్ వంచించారా..?

అయితే.. తాజాగా వాటిని “తెల్ల ఏనుగు”లు అని అభివర్ణిస్తున్న విషయాలు తెరపైకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 Feb 2025 10:30 PM GMT
ఎఫ్-35 పై మస్క్  మాటలు... మోడీని ట్రంప్  వంచించారా..?
X

అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లో ప్రధాని మోడీతో భేటీ అనంతరం డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో భాగంగా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలను భారత్ కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించిందని ప్రకటించారు. దీంతో.. భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇనుమడించేలా కీలక ముందడుగు పడిందంటూ కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. తాజాగా వాటిని “తెల్ల ఏనుగు”లు అని అభివర్ణిస్తున్న విషయాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానంగా పరిగణించబడే ఎఫ్-35 యుద్ధ విమానాన్ని భారతదేశానికి అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ తో భేటీ అనంతరం ఇది భారత ప్రధాని సాధించిన పెద్ద ప్రకటన అని.. ఇది భారత రక్షణ రంగానికి అతిపెద్ద ఆయుధం అనే చర్చ తెరపైకి వచ్చింది.

అయితే... ఇందులో నాణానికి మరో వైపు ఉందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రధానంగా ఎఫ్-35 ను భారత్ కు అందిస్తామని ట్రంప్ ప్రకటించడం, భారత్ నుంచి హర్షం వ్యక్తం అవుతుందని చెబుతున్న నేపథ్యంలో.. గతంలో ఈ యుద్ధ విమానాల గురించి ఎలన్ మస్క్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నాడు ఫైటర్ జెట్ ను విమర్శిస్తూ మస్క్ దాన్ని... "ది వరస్ట్ మిలటరీ వేల్యూ ఫర్ మనీ ఇన్ హిస్టరీ" అని అభివర్ణించారు.

ఇదే సమయంలో... 2024 నవంబర్ 24న ఓ డ్రొన్ ల గుంపును ప్రదర్శించే వీడియోను పోస్ట్ చేసిన ఎలన్ మస్క్... “కొంతమంది ఈడియట్స్ ఇప్పటికీ ఎఫ్-35 వంటి మానవ సముదాయ యుద్ధ విమానాలను నిర్మిస్తున్నారు” అని పేర్కొన్నారు! ఇదే సమయంలో... డ్రోన్ ల యుగమలో మనుషులతో కూడిన యుద్ధ విమానాలు ఏమైనప్పటికీ వాడుకలో నిలువవు.. అవి పైలట్లను చంపేస్తాయి! అని పేర్కొన్నారు!

ఇదే సమయంలో... జెన్ టెక్నాలజీస్ ఛైర్మన్ అశోక్ అట్లూరి స్పందించారు. ఇందులో భాగంగా... ఖర్చు ఆందోళనలు, డిజైన్ లోపాలన పేర్కొంటూ అతను వాటిని "తెల్ల ఏనుగు"గా అభివర్ణించారు! ఈ విధంగా ఎఫ్-35 యుద్ధ విమానాలు భారత్ కు ఇచ్చేందుకు అమెరికా అంగీకరించడం గుడ్ న్యూస్ అని వరుస కథనాలు హల్ చల్ చేస్తోన్న వేళ... ఈ అద్భుతం అనే ప్రచారాన్ని కొట్టిపారేస్తున్న పలు నివేదికలు తెరపైకి వస్తుండటం ఆసక్తిగా మారింది.

ప్రధానంగా మస్క్ అంతటి వ్యక్తి వీటిని "ది వరస్ట్ మిలటరీ వేల్యూ ఫర్ మనీ ఇన్ హిస్టరీ" అని అభివర్ణించిన వేళ... మోడీని ట్రంప్ దెబ్బకొట్టారా? అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో... ఈ యుద్ధ విమానాల మెయింటినెన్స్ ఖర్చు కూడా చాలా ఎక్కువని అంటున్న వేళ... తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రంప్ ఇలాంటి ఆలోచన చేశారా అనే చర్చ తెరపైకి వచ్చిందని చెబుతున్నారు! ఇప్పుడు ఇది ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది!