Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌పై ట్రంప్ ఫోకస్.. 'రియల్' వ్యాపారుల్లో టెన్షన్

మాదాపూర్‌లో ఖానామెట్‌లో భారీ స్థలంలో ట్రంప్ ట్విన్ టవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి.

By:  Tupaki Desk   |   12 Nov 2024 8:30 AM GMT
హైదరాబాద్‌పై ట్రంప్ ఫోకస్.. రియల్ వ్యాపారుల్లో టెన్షన్
X

నాలుగేళ్ల తరువాత మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్ కూర్చోబోతున్నారు. ఇటీవలే ఘన విజయం సాధించి ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే.. రెండోసారి అధ్యక్షుడు అయిన ట్రంప్ కన్ను ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. అదేంటి.. అగ్రనేత అధ్యక్షుడు అయి ఉంది.. హైదరాబాద్ మీద ట్రంప్ ఫోకస్ చేయడం ఏంటా అని ఆలోచిస్తున్నారా..?

కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వ్యాపారాల్లో ఈ ట్రంప్ టవర్స్ నిర్మాణాలు అత్యంత కీలకమైనవి. దీంతోపాటు క్యాసినోలు, హోటళ్లు, గోల్ఫ్ కోర్సులు నిర్మాణాలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ టవర్స్ హైదరాబాద్‌కు రాబోతున్నాయి. అవును.. నిజమే ట్రంప్ టవర్స్ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిర్మింతం కాబోతున్నాయి. మాదాపూర్‌లో ఖానామెట్‌లో భారీ స్థలంలో ట్రంప్ ట్విన్ టవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. దాంతో ఇప్పుడు 2022లోనే హైదరాబాద్‌లో ఈ టవర్స్ నిర్మిణానికి భారీగా భూమిని కొనుగోలు చేశారు. ఎట్టకేలకు ఆయన మరోసారి అధ్యక్షుడు కావడంతో ఈ ప్రాజెక్టు వేగం పుంజుకోనున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో ఇప్పటికే పలు నగరాల్లో ట్రంప్ టవర్స్ నిర్మాణం జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ముంబై, కోల్‌కతా, గుర్గావ్, పుణె వంటి నగరాల్లో ట్రంప్ టవర్లు ఉన్నాయి. తాజాగా.. మరో ఆరు నగరాల్లోనూ వీటిని నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇందులో హైదరాబాద్, బెంగళూరు, నోయిడా ఉన్నాయి. అయితే.. హైదరాబాద్‌లో ట్రంప్ టవర్ల నిర్మాణంతో ఇక్కడి రియల్ ఎస్టేట్‌పై ఆయన సంస్థ కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఇక్కడి వ్యాపారులు గందరగోళంలో పడినట్లుగా తెలుస్తోంది. అంతటి ప్రమాణాలతో నిర్మించలేని పరిస్థితులు ఉండడంతో వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా.. హైదరాబాద్‌లో స్థానిక మంజీరా గ్రూప్‌తో కలిసి ట్రంప్ సంస్థ ఈ జంట టవర్లను నిర్మించబోతున్నది. 2022లోనే హెచ్ఎండీఏ వేలంలో 2.92 ఎకరాల స్థలాన్ని కొన్నారు. ఈ టవర్లు 27 అంతస్తులతో 4 నుంచి 5 బెడ్‌రూంల ఫ్లాట్లుతో కూడిన అపార్ట్‌మెంట్లుగా నిర్మించనున్నారు. 4 బెడ్‌రూం విస్తీర్ణం 4,000 నుంచి 5,000 చదరపు అడుగులు ఉండగా.. 5 బెడ్‌రూంల ఫ్లాట్ విస్తీర్ణం 6,000 చదరపు అడుగులు ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఈ స్థాయిలో చెప్పుకోదగినవి లేవు. ఇప్పుడు ట్రంప్ టవర్స్‌ ఇంత భారీ విస్తీర్ణంతో రావడంతో హైదరాబాద్ మార్కెట్లో కొత్తగా పరిచయం చేస్తున్నట్లేనని అర్థం చేసుకోవచ్చు. అటు అంతర్జాతీయ సంస్థ కావడం.. ట్రంప్ బ్రాండ్ కావడంతో డిమాండ్‌ భారీగా ఉంటుందని సమాచారం. అంతేకాదు.. డిమాండ్‌తోపాటు రేట్లు కూడా భారీగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది. చదరపు అడుగుకు రూ.13వేల ధరను నిర్ణయించనున్నారు. ఈలెక్క ప్రకారం 4 బెడ్‌రూంల అపార్ట్‌మెంట్ ధర సుమారు రూ.5.5 కోట్లు పలుకుతుంది. ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణాలు కానీ, అంతర్జాతీయ సంస్థలు కానీ హైదరాబాద్‌లో పెద్దగా లేవు. తాజాగా.. ట్రంప్ టవర్స్ నిర్మాణంతో ముందుముందు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలంటి మార్పులకు దారితీయనుందనదే ఆసక్తికరంగా మారింది.