Begin typing your search above and press return to search.

ఎన్నికల నేపథ్యంలో…మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై మరో కేసు..

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నాడు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 8:30 AM GMT
ఎన్నికల నేపథ్యంలో…మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై మరో కేసు..
X

అమెరికాలో త్వరలో అధ్యక్ష పదవికి సంబంధించిన పోటీలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నాడు. అయితే 2020 చివరిలో జరిగిన పోటీలలో అతను ఓటమిపాలయ్యాడు. ఇక ట్రంప్ పోటీకి దిగుతున్న నేపథ్యంలో అతనిపై ఎన్నో రకాల వివాదాలు లైన్ లైట్లోకి వస్తున్నాయి.

2020 ఎన్నికల ఓటమికి ముందే డోనాల్డ్ ట్రంప్ జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారు అంటూ అతనిపై ఆరోపణ కోర్టు వరకు వెళ్ళింది. ప్రాసిక్యూటర్ వాదన ప్రకారం ఓటర్లను మోసం చేయడానికి ట్రంప్ తప్పుడు వాదనలను ఉపయోగించారు అని తెలుస్తోంది. అంతేకాదు అధికారంలో ఉండడానికి ఆయన నేరపూరిత ప్రవర్తనను ఉపయోగించారు అన్న అభియోగం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో ఎంతో తీవ్రమైన రీకోచట్ట ఉల్లంఘన కేసును ట్రంప్ పై నమోదు చేశారు. ఓ రకంగా తీసుకుంటే ఈ సంవత్సరం కాలంలో ఇది ట్రంప్ పై నమోదైన నాలుగవ కేసు. ఇప్పటికే ట్రంప్ పై రహస్య దస్తావేజులను తన ఇంట్లో దాచి పెట్టారని, పోర్న్ స్టార్ కు డబ్బులు చెల్లించారని, క్యాపిటల్ భవనంపై తన మద్దతుదారులను ఉసిగొల్పారు అన్న ఆరోపణలతో మూడు కేసులు నమోదయ్యాయి..

అయితే ఈ అభియోగాలపై స్ట్రాంగా రియాక్ట్ అయిన ట్రంప్ బృందం.. 2024 ఎన్నికల్లో ట్రంప్ గెలుపుని జీర్ణించుకోలేక ఎటువంటి అభియోగాలు చేస్తున్నారు అని ఘాటుగా స్పందిస్తుంది. 20201 ఫిబ్రవరిలో ఎన్నికలలో జోక్యంపై ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్‌ అటార్నీ దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో తప్పుడు వాంగ్మూలాలు, పత్రాల సృష్టి, ఫోర్జరీ, సాక్షాల తారుమా, చట్టబుల్లంఘన లాంటి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గతంలో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ట్రంప్ నిరంతరం తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేశారని.. ఈ కారణం చేత అతని మద్దతుదా రులు 2021 జనవరి 6వ తారీఖున ఎస్ క్యాపిటల్ పై దాడి చేశారని ప్రాసిక్యూటర్ వాదించారు. 2024 ఎన్నికలకు కొన్ని వారాల వ్యవధి ఉన్న సమయంలో ఇప్పుడు ట్రంప్ పైన ఈ కేసులు.. వెలుగులోకి వస్తున్న నిజాలు రిపబ్లిక్ శిబిరంలో ఆందోళన సృష్టిస్తున్నాయి. ఈసారి ట్రంప్ గెలుస్తాడా లేదా అన్న విషయం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.