కత్తి పట్టుకుని ట్రేడ్ మార్క్ స్టెప్పులేసిన ట్రంప్... వీడియో వైరల్!
ఈ సమయంలో మిలటరీ కత్తి చేతపట్టిన అమెరికా నూతన అధ్యక్షుడు తన ట్రేడ్ మార్క్ స్టెప్పులేశారు.
By: Tupaki Desk | 21 Jan 2025 12:11 PM GMTప్రపంచ పెద్దన్న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనది "అమెరికా ఫస్ట్" నినాదమని, అగ్రరాజ్యంలో స్వర్ణయుగం మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో మిలటరీ కత్తి చేతపట్టిన అమెరికా నూతన అధ్యక్షుడు తన ట్రేడ్ మార్క్ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఈ సమయంలో తన భర్య మెనాలియా ట్రంప్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ గా మారింది. రెండోసారి ప్రెసిడెంట్ అవ్వడంతో ట్రంప్ ఆనందానికి అవధులు లేవన్నట్లున్నాయనే చర్చ ఇప్పుడు నెట్టింట మొదలైంది. అందుకే ఆయన ఇలా ఓపెన్ అయిపోతున్నారని అంటున్నారు.
తాజాగా కమాండర్ ఇన్ చీఫ్ బాల్ వద్ద కేక్ కటింగ్ వేడుక ప్రారంభోత్సవంలో కేక్ కట్ చేసే సమయంలో ట్రంప్ కు కత్తి అందించారు అధికారులు. ఈ సమయంలో ఆ కత్తి చేతపట్టి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు ట్రంప్. తనదైన ట్రేడ్ మార్క్ స్టెప్పులతో ఊగిపోయారు. ఈ సమయంలో మెనాలియా ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు వాన్స్ దంపతులు చిరునవ్వులు చిందించారు.
ఈ సమయంలో ట్రంప్ భార్య మొనాలియా కూడా పాదాలు కదుపుతూ స్టెప్పులు వేశారు. ఈ సమయంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ దంపతులు వేదికపైనే ఉన్నారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ టక్సేడో ధరించి రాగా.. మెనాలియా వైట్ కలర్ స్లీవ్ లెస్, బ్లాక్ కలర్ జిగ్ జాగ్ డ్రెస్ లో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన పిక్స్, వీడియోస్ వైరల్ గా మారాయి.