యాపిల్ ను కొరికేసిన ట్రంప్ నోటి దూల.. ఒక్కరోజులో రూ.15 లక్షల నష్టం
యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఎన్విడియా, గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్, అమెజాన్, మెటా.. ఇవీ అమెరికా అతిపెద్ద టెక్ దిగ్గజాలు.
By: Tupaki Desk | 11 March 2025 5:59 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరకు ఎక్కడకు తీసుకెళ్తారో కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ దేశానికే కాదు ప్రపంచానికీ గడ్డు కాలం వచ్చిందా? అనిపిస్తోంది.. ట్రంప్ నోటి దురుసు.. చేతల్లో ఆయన చూపే దూకుడు.. కొత్తకొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ట్రంప్ చర్యలు సాధారణ మానవుడి నుంచి దిగ్గజ సంస్థలనూ ఇబ్బందుల పాల్జేస్తున్నాయి.
7 సిస్టర్స్.. వన్ బ్రదర్
యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఎన్విడియా, గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్, అమెజాన్, మెటా.. ఇవీ అమెరికా అతిపెద్ద టెక్ దిగ్గజాలు. అఫ్ కోర్స్.. ప్రపంచంలోనే పెద్ద టెక్ దిగ్గజాలు అని కూడా చెప్పొచ్చు. వీటిని సెవెన్ సిస్టర్స్ అనుకుంటే.. ట్రంప్ బ్రదర్ చర్యలు వాటిని నానాతిప్పలు డుతున్నాయి. అమెరికా మార్కెట్ లో ఆధిపత్యం చెలాయించే ఈ ఏడు టెక్ కంపెనీలు ఇప్పుడు ఆందోళన చెండుతున్నాయి.
సుంకాల ఆందోళన నేపథ్యంలో, మార్కెట్ ఒడిదొడుకులతో తాజాగా ఈ ఏడు కంపెనీల షేర్లు కుప్పకూలాయి. సోమవారం మార్కెట్ విలువలో ఏకంగా 750 బిలియన్ డాలర్లు కోల్పోయాయి. 2022 తర్వాత అత్యంత భారీ స్థాయిలో నాస్‌డాక్ భారీగా క్షీణించింది.అమెరికన్లే కాదు భారతీయులూ ఎంతో ఇష్టపడే యాపిల్ ఒక్క రోజులోనే రూ.15 లక్షల కోట్ల మార్కెట్ విలువ కోల్పోయింది.
ఇది డాలర్లలో చూస్తే 174 బిలియన్ డాలర్లు. దీని తర్వాత స్థానంలో ఏఐ చిప్ మేకర్ ఎన్విడియా ఉంది. ఈ కపెనీ షేర్లు 5 శాతం క్షీణించి మార్కె్‌ట్ విలువలో 140 బిలియన్ డాలర్లు కోల్పోయాయి. జనవరిలో కొత్త గరిష్ఠాన్ని నమోదు చేసిన ఈ సంస్థ కేవలం రెండు నెలల్లోనే మూడో వంతు క్షీణించడం గమనార్హం.
ట్రంప్ స్నేహితుడు, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. మూడు నెలల్లో ఈ కంపెనీ తన విలువలో సగం పైగా కోల్పోయింది. సోమవారం 130 బిలియన్ డాలర్లు నష్టపోయింది. మైక్రోసాఫ్ట్ 98 బిలియన్ డాలర్లు, గూగుల్ 95 బిలియన్ డాలర్లు, అమెజాన్ 50 బిలియన్ డాలర్లు, మెటా 70 బిలియన్ డాలర్లు మేర తమ మార్కెట్ విలువను కోల్పోయాయి.