Begin typing your search above and press return to search.

ఆయ‌న నాయ‌కుడే కాదండోయ్..గొప్ప క‌ళాకారుడు కూడా!

త‌న ట్యాలెంట్ ని ట్రంప్ సినిమాల్లోనూ చూపించారు సినిమాల‌తో పాటు టీవీ షోల్ల‌నూ ట్రంప్ ముద్ర వేసారు.

By:  Tupaki Desk   |   7 Nov 2024 5:54 AM GMT
ఆయ‌న నాయ‌కుడే కాదండోయ్..గొప్ప క‌ళాకారుడు కూడా!
X

అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను ఓడించిన 78 ఏళ్ల ట్రంప్ రిపబ్లికన్‌ పార్టీ జయకేతనం ఎగురవేశారు. ఇక ట్రంప్ భిన్న‌మైన వ్య‌క్తి. ఎందుకంటే ఆయ‌న కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుడు మాత్ర‌మే కాదు ఓ సినిమా న‌టుడు కూడా. త‌న ట్యాలెంట్ ని ట్రంప్ సినిమాల్లోనూ చూపించారు. సినిమాల‌తో పాటు టీవీ షోల్ల‌నూ ట్రంప్ ముద్ర వేసారు.

80వ దశకంలో న్యూయార్క్‌లో రియల్ ఎస్టేట్ మొఘల్‌గా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ చాలా సినిమాల్లో అతిథి పాత్రలను పోషించారు. అంతేకాదు రియాలిటీ షోస్‌లోనూ సందడి చేశారు. తొలుత 1989లో `గాస్ట్స్ కాన్ట్ డూ ఇట్` సినిమాలో కనిపించారు. ఇందులో ఓ చిన్న వేషం మాత్ర‌మే వేసారు. ఆ తర్వాత `హోమ్ అలోన్‌-2`లో క్యామియో రోల్ చేశారు. 1994లో వచ్చిన `లిటిల్ రాస్కెల్స్`, `జూలాండర్`, `ది అసోసియేట్` వంటి పాపులర్ సినిమాల్లో ట్రంప్ నటించారు.

90వ దశకంలో, ట్రంప్ `హోవార్డ్ స్టెర్న్` షోలో 24 సార్లు కనిపించడంతో.. ట్రంప్ పాపులారిటీ అమెరికాలో బాగా పెరిగింది. 1995 లో `ఎక్రాస్ ది సీ ఆఫ్ టైమ్`, 1996 లో `ది అసోసియేట్`, 1998 లో ` సెల‌బ్రిటీ,` 2001 లో `జూలాండ‌ర్ చిత్రాల్లో ముఖ్య‌మైన పాత్ర‌లు పోషించారు. 2002 లో` టూ వీక్స్ నోటీస్`, 2010 లో `వాల్ స్ట్రీట్`, `మ‌నీ నెవ‌ర్ స్లీప్స్` తో పాటు `ఎడ్డీ`, `పీఓఎం వండ‌ర్ పుల్ ప్ర‌జెంట్స్`, `స్మాల్ పోటాటోస్`, `హూ కిల్ యూసీఎఫ్ ఎల్` వంటి చిత్రాల్లో న‌టించారు.

2003లో ట్రంప్ ‘ది అప్రెంటిస్’ అనే రియాలిటీ షోకు హోస్ట్ కమ్ నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లో ఏదైనా రియాలిటీ షోలో ప్రతి ఎపిసోడ్‌కి 3 మిలియన్ డాలర్లని ట్రంప్ సంపాదించారు. ఇది ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ సెలబ్రిటీలలో ఒకరిగా ట్రంప్‌ని నిలబెట్టింది. ఆ సంపాదనతో ట్రంప్ పేరు అప్పట్లో మార్మోగిపోయింది.