Begin typing your search above and press return to search.

డొనాల్డ్ ట్రంప్.. టాప్ 7 సీక్రెట్స్..

ఇప్పటికే ఒకసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ట్రంప్ గురించి 2017లోనే ప్రపంచానికి తెలిసింది. అయితే, మరో ఎనిమిదేళ్ల తర్వాత తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

By:  Tupaki Desk   |   20 Jan 2025 9:30 PM GMT
డొనాల్డ్ ట్రంప్.. టాప్ 7 సీక్రెట్స్..
X

సీక్రెట్ ఏజెంట్ల అనుక్షణం నిఘాలో.. అగ్ర రాజ్య అధిపతి హోదాలో.. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంటారు అమెరికా అధ్యక్షుడు. ఈ పదవిలోకి వచ్చేవారు ఎవరైనా సరే.. వారి నేపథ్యం ఏమిటా? అని ప్రపంచం అంతా ఎదురుచూస్తుంటుంది. ఇప్పుడు మరింత ఆలోచిస్తోంది. ఎందుకంటే ఈ సారి బాధ్యతలు చేపట్టబోతున్నది డొనాల్డ్ ట్రంప్.

ఇప్పటికే ఒకసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ట్రంప్ గురించి 2017లోనే ప్రపంచానికి తెలిసింది. అయితే, మరో ఎనిమిదేళ్ల తర్వాత తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అప్పటికి, ఇప్పటికి ఒక తరం మారి ఉండడమే దీనికి కారణం.

ట్రంప్ ఎక్కడ ఉంటే అక్కడ సంచలనమే. అది వ్యాపారమైనా, రాజకీయమైనా… చరిత్ర ఇదే చెబుతోంది. కాగా, ట్రంప్ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి బాగా సంపాదిస్తే దానిని ట్రంప్ మరింత పెంచారు.

రియల్ ఎస్టేట్‌ ఇతర వ్యాపారాలతో ట్రంప్ రూ.వేల కోట్లకు ఎదిగారు.

రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతో తన ఇమేజ్, క్రేజ్, పాపులారిటీని మరింత పెంచుకునేందుకు వినోద పరిశ్రమ సాయం తీసుకున్నారు. పాపులారిటీని పెంచుకుని రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే వారిని దీనినో పాఠంగా చెబుతుంటారు.

- హాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్‌ తో కలసి పలు టీవీ షోలు, సినిమాల్లో సందడి చేస్తూ సాధారణ జనానికి కూడా దగ్గరయ్యారు ట్రంప్.

- అత్యంత పాపులర్ షో శాటర్ డే నైట్ లైవ్‌ కు ట్రంప్ రెండు సార్లు హోస్ట్‌ అంటే మీరు నమ్మాల్సిందే.

- కొట్టుకోవడాన్ని కూడా అత్యంత వినోదంగా వీక్షించే కార్యక్రమం వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ). ఈ షోలో ట్రంప్ ఒకసారి పాల్గొన్నారు.

- 2007లో నిర్వహించిన బ్యాటిల్ ఆఫ్ బిలియనీర్స్ ఈవెంట్‌ లో ట్రంప్ పాల్గొనగా ఆయన రెజ్లర్లు విజయం సాధించారు.

- క్రిస్మస్ క్లాసిక్‌ హోమ్ ఎలోన్ 2 (లాస్ట్ ఇన్ న్యూయార్క్ 1992) అనే సినిమాలో ట్రంప్ నటించారు.

- హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ నిర్వహించే ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ అనే కామెడీ షోలో ట్రంప్ అతిథిగా పాల్గొన్నారు. వాస్తవానికి ఈ షో ట్రంప్ పాపులారిటీని బాగా పెంచింది.

- 2001లో విడుదలైన జులాండర్ అనే మరో చిత్రంలోనూ ట్రంప్ మెరిశారు. వ్యక్తిగత ఇమేజ్‌ ను పెంచుకునేందుకు

సొంత సోషల్ మీడియా

ఓ దశలో టిక్ టాక్, ట్విటర్ మీద ఒంటికాలితో ఎగిరిన ట్రంప్.. సొంతంగా ట్రూత్ అనే సోషల్ మీడియాను నెలకొల్పారు. మిగతా సోషల్ మీడియానూ విపరీతంగా వాడుతుంటారు. యువ ఓటర్లకు అలానే దగ్గరయ్యారు.

భావోద్వేగాలతో ఆడుకుంటారు..

ట్రంప్ భావోద్వేగంతో ప్రసంగిస్తారు. అమెరికా ప్రజలు ఏం కోరుకుంటున్నారో పసిగడతారు. ఇలానే ఈసారి ఎన్నికల్లో మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మెగా) నినాదంతో దూసుకెళ్లారు. దీని మీదే ప్రచారాన్ని నడిపించి ఘన విజయం సాధించారు. అంతేకాదు.. ఎంత సాహసానికైనా వెనుకాడకపోవడం ట్రంప్ విజయానికి కారణం.