Begin typing your search above and press return to search.

ట్రంప్ వ‌ర్సెస్ క‌మ‌ల‌: అగ్ర‌రాజ్యంలో హోరా హోరీ..

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు అంద‌రూ ఊహించిన‌ట్టుగానే అత్యంత ట‌ఫ్‌గా మారాయి.

By:  Tupaki Desk   |   6 Nov 2024 5:37 AM GMT
ట్రంప్ వ‌ర్సెస్ క‌మ‌ల‌: అగ్ర‌రాజ్యంలో హోరా హోరీ..
X

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు అంద‌రూ ఊహించిన‌ట్టుగానే అత్యంత ట‌ఫ్‌గా మారాయి. ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతున్న డెమొక్రాటిక్ అభ్య‌ర్థి, ప్ర‌స్తుత ఉపాధ్యురాలు క‌మ‌ల హ్యారిస్‌, రిప‌బ్లిక‌న్ పార్టీ నేత‌, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ధ్య నెక్ టు నెక్ అన్న‌ట్టుగా ఎన్నిక‌ల పోరు సాగుతోంది. నిజానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వేల్లో ట్రంప్ వ‌ర్సెస్ క‌మ‌ల మ‌ధ్య పెద్ద‌గా పోరు ఉండ‌ద‌ని భావించారు. క‌మ‌ల‌దే గెలుపు అని కూడా.. ఆదివారం రాత్రి వ‌ర‌కు స‌ర్వేలు చెప్పాయి.

కానీ, ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల మూడ్ మాత్రం దీనికి భిన్నంగా మారింది. యువ‌త, పారిశ్రామిక వేత్త‌లు మొత్తంగా ట్రంప్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇక‌, భార‌తీయ ఓట‌ర్లు స‌హా.. ఇత‌ర విదేశీ ఓట‌ర్లు.. మ‌హిళా ఓట‌ర్లు మాత్రం హ్యారిస్‌కు అనుకూలంగా ఓటెత్తారు. దీంతో ఎన్నిక‌ల ఫ‌లితం ఇప్పుడు ట‌ఫ్‌గా మారిపోయింది. అనేక రాష్ట్రాల్లో పోటెత్తిన ఓట‌ర్లు.. కొంద‌రు బ‌హిరంగంగానే ట్రంప్‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కాలిఫోర్నియా, న్యూజెర్నీ, అరిజోనా వంటి మ‌రికొన్ని రాష్ట్రాల్లో మాత్రం క‌మ‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపారు.

ఎలా చూసుకున్నా.. ట్రంప్‌, క‌మ‌ల‌కు మాత్రం పోటీ తీవ్రంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి తొలి రెం డు రౌండ్ల ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో ట్రంప్ శిబిరం దూకుడుగా ఉంది. అయితే.. రౌండ్లు పెరుగుతున్న కొద్దీ.. క‌మ‌ల కూడా పుంజుకున్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య ఓట్ల తేడా త‌గ్గుతూ వ‌చ్చింది.

ఫ‌లితం ఎలా ఉంది?

+ రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి 230 ఎలక్టోరల్‌ ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

+ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 210 ఎలక్టోరల్ ఓట్ల‌తో దూకుడుగా ఉన్నారు.

ఏయే రాష్ట్రాల్లో ఆధిక్యం?

రిప‌బ్లిక‌న్ పార్టీ..

కాన్సస్‌, అయోవా, మోంటానా, యుటా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా, సౌత్‌, ఇండియానా, నార్త్‌ డకోటా, వయో మింగ్‌, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సో రి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, ఐడహో, నార్త్‌ కరోలినా రాష్ట్రాలలో రిప‌బ్లిక‌న్ పార్టీ నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కారు.

డెమొక్రాటిక్ పార్టీ..

కాలిఫోర్నియా, ఓరెగన్‌, వాషింగ్టన్‌, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, వెర్మాంట్‌, న్యూయార్క్‌, కనెక్టికట్‌, డెలవేర్‌, మసాచుసెట్స్‌, రోడ్‌ ఐల్యాండ్‌, కొలరాడో, హవాయిల‌లో అధికార డెమొక్రాట్లు విజ‌యం ద‌క్కించుకున్నారు.