Begin typing your search above and press return to search.

ప్రొబెషనరీ సిబ్బందికి ట్రంప్ ఎసరు.. నెంబర్ తెలిస్తే షాకే!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ అటు ప్రపంచ దేశాలతో పాటు స్వదేశీ జనాలకూ డొనాల్డ్ ట్రంప్ షాకులిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Feb 2025 4:17 AM GMT
ప్రొబెషనరీ సిబ్బందికి ట్రంప్ ఎసరు.. నెంబర్ తెలిస్తే షాకే!
X

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ అటు ప్రపంచ దేశాలతో పాటు స్వదేశీ జనాలకూ డొనాల్డ్ ట్రంప్ షాకులిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ప్రొబెషన్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ సాగనంపాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆదేశించింది. దీంతో.. ఈ విషయం తీవ్ర కలకలం రేపుతోంది.

అవును... ట్రంప్ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా.. ప్రొబేషన్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ సాగనంపాలని ఆదేశించింది. దీంతో.. ఏడాది కాలంగా ప్రొబేషన్ లో ఉండి ఇంకా పర్మినెంట్ కాని లక్షలాది మంది ఉద్యోగులపై వేటు పడనుందని అంటున్నారు. వీరు ఈ నిర్ణయంపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని చెబుతున్నారు.

వాస్తవానికి నిరుడు మార్చి నాటికి ఏడాదికంటే తక్కువ కాలం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రొబేషనరీ ఉద్యోగుల సంఖ్య 2,20,000గా చెబుతున్నారు. ఇందులో.. ప్రధానంగా విద్యాశాఖ, వినియోగదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ సంస్థలో ప్రొబేషనరీ ఉద్యోగులకు ఉద్వాసన మొదలైందని చెబుతున్నారు.

కాగా.. అమెరికాలో పోస్టల్, రక్షణ సిబ్బంది మినహా మొత్తం ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 24 లక్షలు కాగా.. వారు సెప్టెంబర్ 30 కల్లా రాజీనామా చేస్తే తగు పరిగాహం చెల్లిస్తామని అమెరికా సర్కార్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో.. ఈ ప్రతిపాదనకు ఇంతవరకూ 75,000 మంది ఉద్యోగులు రాజీనామాకు సుముఖత తెలిపారని అంటున్నారు.

ఈ సందర్భంగా... యునైటెడ్ స్టేట్స్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ ట్ (ఓపీఎం) లోని డజన్ల కొద్దీ ప్రొబేషనరీ ఉద్యోగులకు గురువారం మధ్యాహ్నం గ్రూప్ కాల్ లో వారిని తొలగిస్తున్నట్లు చెప్పారని.. అనంతరం అరగంటలోనే ఆఫీసు నుంచి వెళ్లిపోవాలని సూచించారని ఓ వ్యక్తి చెప్పినట్లు ఇంగ్లిష్ మీడియా నివేదించింది.