యుద్ధం ఆపి కాదు..విలీనంతో..రష్యా-ఉక్రెయిన్ ను కలిపేస్తున్న ట్రంప్!
అయితే, తాను అమెరికా అధ్యక్షుడిగా లేనందునే ఉక్రెయిన్ పై రష్యా దాడికిగి దిగిందని.. తాను మళ్లీ అధ్యక్షుడినైతే యుద్ధాన్ని ఆపేస్తానని చెబుతూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్.
By: Tupaki Desk | 11 Feb 2025 10:30 PM GMT2022 ఫిబ్రవరి 24న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన రోజు.. అంటే ఈ ఫిబ్రవరి 24కు సరిగ్గా మూడేళ్లు. ఈ వ్యవధిలో ఉక్రెయిన్ ఎంతో నష్టపోయింది. రష్యా కూడా సైనికంగా బాగా దెబ్బతిన్నది. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఆంక్షలను ఎదుర్కొంటోంది. అయితే, తాను అమెరికా అధ్యక్షుడిగా లేనందునే ఉక్రెయిన్ పై రష్యా దాడికిగి దిగిందని.. తాను మళ్లీ అధ్యక్షుడినైతే యుద్ధాన్ని ఆపేస్తానని చెబుతూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. అలానే ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు.
వాస్తవానికి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కంటే భీకరమైనది.. సుదీర్ఘంగా సాగుతున్నది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. అయితే, ట్రంప్ తాను గెలిచిన వారం రోజుల్లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి ఆ మేరకు విజయవంతం అయ్యారు. ఇక మిగిలింది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ కు గతం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ కు నచ్చజెప్పి యుద్ధాన్ని ఆపిస్తారనే ఆశాభావం వ్యక్తమైంది. కానీ, ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే గందరగోళం నెలకొంటోంది.
ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యా లో భాగం కావొచ్చు.. కాకపోవచ్చని అన్నారు. ఆ రెండు దేశాలు ఒప్పందం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చని.. ఉక్రెయిన్లు.. రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు అని ట్రంప్ గమ్మత్తుగా మాట్లాడారు.
ఉక్రెయిన్ తో 500 మిలియన్ డాలర్ల డీల్ తో పాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు. యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్ ను త్వరలో ఉక్రెయిన్ కు పంపనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చే వారం జర్మనీలోని మ్యానిచ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో భేటీ కానున్నారు.
జెలెన్‌స్కీపుతిన్ శాంతి చర్చలకు రావాలని పిలుపునిస్తూ వస్తున్న ట్రంప్.. రష్యా చర్చలకు వచ్చేందుకు నిరాకరిస్తే.. ఆంక్షలు విధిస్తానంటూ హెచ్చరించారు. ఇటీవల పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్.. యుద్ధంలో అమాయక ప్రజలు చనిపోతుడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఆపాలని పుతిన్ కోరుకుంటున్నట్లు ట్రంప్ తర్వాత తెలిపారు.