Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నికల ఫలితాలు... ట్రంప్ వైపే అగ్రరాజ్యం ప్రజలు!?

ప్రపంచంలోనే అత్యంత హాట్ టాపిక్ గా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

By:  Tupaki Desk   |   6 Nov 2024 4:36 AM GMT
అమెరికా ఎన్నికల ఫలితాలు... ట్రంప్  వైపే అగ్రరాజ్యం ప్రజలు!?
X

ప్రపంచంలోనే అత్యంత హాట్ టాపిక్ గా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ 52.4 శాతం ఓట్లతో 230 ఎలక్టోరల్ సీట్లు దక్కించుకున్నారు. కమలా హారిస్.. 46.3 శాతం ఓట్లతో 179 ఎలక్టోరల్ సీట్లు సంపాదించుకున్నారు!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలో ట్రంప్ దూకుడు కనిపిస్తోంది. ఇందులో భాగంగా... అయోవా, కాన్సస్, నార్త్ డకోటా, యుటా, సౌత్ డకోటా, వయోమింగ్, ఓక్లహోమా, నెబ్రాస్కా, ఆర్కాన్సాస్, టెక్సాస్, ఇండియానా, లీసియానా, టెన్నెసీ, కెంటకీ, ఓహోయే, మిసిసిపి, అలబామా, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా వంటి సుమారు 22 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు.

ఇదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్... న్యూజెర్సీ, ఇల్లినోయీ, న్యూయార్క్, మేరీ ల్యాండ్, కనెక్టికట్, వెర్మాంట్, మసాచుసెట్స్, డెలవేర్, కోరాడో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, కాలిఫోర్నియా, వాషింగ్టన్ మొదలైన రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు!

పోలింగ్ బూత్ వద్ద ట్రంప్ కొడుకు!:

ఈ సందర్భంగా... అమెరికా మాజీ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. తన తండ్రి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేస్తున్న తన కుమారుడు బారన్ ట్రంప్ ఫోటోను పోలింగ్ స్టేషన్ లో పోస్ట్ చేశారు! ఈ సందర్భంగా... "మొదటిసారి ఓటు వేశారు - తన తండ్రికి" అని మెలానియా ట్రంప్ ట్వీట్ చేశారు.