Begin typing your search above and press return to search.

'బిగ్' ఇష్యూ... భారత్ లో ట్రంప్ భారీ గా ప్లాన్ చేస్తున్నారంట!

మరో పక్క భారత్ లో మాత్రం ట్రంప్ భారీగా ప్లాన్ చేస్తున్నారని.. ఇందులో భాగంగా అధిక సంఖ్యలో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 Nov 2024 10:17 AM GMT
బిగ్ ఇష్యూ... భారత్  లో ట్రంప్  భారీ గా ప్లాన్  చేస్తున్నారంట!
X

అత్యంత ఆసక్తికరంగా, మరింత రసవత్తరంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సర్వేల ఫలితాలు, విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ విక్టరీ సాధించారు. దీంతో... త్వరలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరోపక్క ట్రంప్ విజయం తాలూకు ఎఫెక్ట్ ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాల్లోనూ మొదలైందని అంటున్నారు. ఇందులో భాగంగా.. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకేతాలను చూపిస్తుందని అంటున్నారు. ఇప్పటికే ట్రంప్ స్నేహితుడు మస్క్ సంపద మొత్తం $ 50 బిలియన్లు పెరిగి 314 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

మరోపక్క ఇజ్రాయెల్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్ కరెన్సీ విలువ ఘోరంగా పడిపోయింది. ఒక డాలర్ కు సుమారు 7.03 లక్షల రియాల్స్ స్థాయికి భారీ పతనాన్ని ఇరాన్ ఎదుర్కొందని అంటున్నారు! మరో పక్క భారత్ లో మాత్రం ట్రంప్ భారీగా ప్లాన్ చేస్తున్నారని.. ఇందులో భాగంగా అధిక సంఖ్యలో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారని అంటున్నారు.

అవును... అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో ట్రంప్ టవర్లను కలిగి ఉన్న దేశంగా భారత్ నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... రాబోయే ఐదేళ్లలో భారత్ లో పలు కీలక నగరాల్లో 10కి పైగా ప్రాజెక్టులు రానున్నాయని చెబుతున్నారు. ఇది వీలైనంత త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

వాస్తవానికి ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆయా నగరాల్లో ట్రంప్ టవర్లు ఐకానిక్ భవనాలుగా పిలవబడతాయి. ప్రాపర్టీ లొకేషన్ తో పాటు, లే అవుట్ లు, ప్రత్యేకమైన మెరుపులు వెరసి ట్రంప్ టవర్లు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయని చెబుతారు. అయితే... వీటిలో కొన్ని హోటల్స్ గా రూపొందించబడగా.. మరికొన్ని రెసిడెన్షియల్ పర్పస్ లో నిర్మించబడ్డాయి!

ఈ నేపథ్యంలో త్వరలో భారతదేశంలో ట్రంప్ టవర్స్ పెద్ద ఎత్తున నిరంఆణాలు జరగబోతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. పలు నగరాల్లో సుమారు 10కి పైగా ప్రాజెక్టులు రానున్నాయని చెబుతున్నారు.