Begin typing your search above and press return to search.

పుతిన్ అడుగుపెట్టిన వేళా విశేషం... ఉక్రెయిన్ కు బిగ్ షాక్!

అవును... ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతోన్న వేళ కర్క్స్ రీజియన్ లో బుధవారం పుతిన్ పర్యటించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 March 2025 11:18 PM IST
పుతిన్  అడుగుపెట్టిన వేళా విశేషం... ఉక్రెయిన్  కు బిగ్  షాక్!
X

అవిరామంగా సాగుతోన్న ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధంలో శాంతి ప్రయత్నాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. పశ్చిమ రష్యాలోని కర్క్స్ లో బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించారు. ఈ సందర్భంగా... రష్యా దళాల కంట్రోల్ సెంటర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా మిలటరీ డ్రెస్ లో పుతిన్ కనిపించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా... రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలెరీ జెరసిమోవ్... యుద్ధ భూమిలోని పరిస్థితులను పుతిన్ కు వివరించారు. ఈ నేపథ్యంలో... కీవ్ దళాలను వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలని పుతిన్ ఆదేశించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ సమయంలో రష్యాకు ఓ ఓ గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

అవును... ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతోన్న వేళ కర్క్స్ రీజియన్ లో బుధవారం పుతిన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గురువారం రష్యాకు ఓ గుడ్ న్యూస్ వినిపించింది. ఈ సందర్భంగా కర్క్స్ రీజియన్ లోని అతిపెద్దదైన సుడ్జా పట్టణాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది.

వాస్తవానికి ఈ రీజియన్ లోని కొంతభాగాన్ని గత ఏడాది ఉక్రెయిన్ బలగాలు అనూహ్యంగా ఆక్రమించుకున్నాయి. అయితే... అమెరికా నుంచి ఉక్రెయిన్ కు సాయం నిలిచిపోవడంతో పాటు ఉత్తర కొరియా దళాలు కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ పలు ఉక్రెయిన్ స్థావరాలను స్వాధీనం చేసుకోవడంతో తాజాగా సుడ్జాను పుతిన్ సేనలు ఆధీనంలోకి తీసుకున్నాయి.

రష్యాకు ట్రంప్ స్మూత్ వార్నింగ్!:

మరోపక్క.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయలుదేరారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ వద్ద అగ్రరాజ్యం అధ్యక్షుడు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తమ ప్రతినిధులు రష్యాకు బయలుదేరారని.. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే తాను ఆశిస్తున్నానని.. లేదంటే మాత్రం యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని.. అదే జరిగితే ఆర్థికంగా మాస్కో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అది రష్యాకే వినాశనకారంగా మారుతుందని ట్రంప్ వెల్లడించారు.