Begin typing your search above and press return to search.

ట్రంప్ కు వరుసగా మూడు భారీ గుడ్ న్యూస్ లు!

ఈ సర్వే ఫలితాల్లో తన ప్రత్యర్థి కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 4:02 AM GMT
ట్రంప్ కు వరుసగా మూడు భారీ గుడ్ న్యూస్  లు!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇద్దరూ స్వింగ్ స్టేట్స్ పై కాన్సంట్రేషన్ చేశారని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా మూడు సర్వే ఫలితాలు తెరపైకి వచ్చాయి. అయితే... ఈ సర్వే ఫలితాల్లో తన ప్రత్యర్థి కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.

అవును... తాజాగా వెలువడిన మూడు సర్వేల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పై పై చేయి సాధించారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాపకింద నీరులా ట్రంప్ తన మద్దతును పెంచుకుంటున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ కే స్వల్ప ఆధిక్యంతో గెలుపు అవకాశాలూ ఉన్నాయని తాజా సర్వే తేల్చింది. ఇందులో భాగంగా... ద వాల్ స్ట్రీట్ జర్నల్ నేషనల్ లెవెల్ లో నిర్వహించిన సర్వేల్లో ట్రంప్ 47 పాయింట్లు సాధించారని వెల్లడించింది.

అయితే కమలా హారిస్ 45 పాయింట్లు మాత్రమే పోంది, ట్రంప్ కంటే స్వల్పంగా వెనుకబడి ఉన్నారని వెల్లడించింది. ఇదే సమయంలో... అన్ని స్వింగ్ స్టేట్స్ (అరిజోనా, మిచిగాన్, జార్జియా, నార్త్ కరోలినా, నెవెడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్) లోనూ ట్రంప్, హారిస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు ఉండనుందని అంచనా వేసింది!

ఇదే సమయంలో సీ.ఎన్.బీ.సీ. ఆల్ అమెరికా ఎకనామిక్ సర్వేలో కూడా ట్రంప్ దే పైచేయి అని స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఈసర్వేలోనూ రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 48 శాతం పాయింట్లు సంపాదించగా.. డెమోక్రాట్ల అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ 46 శాతం పాయింట్లు దక్కించుకున్నారు.

ఇదే క్రమంలో.. హారిస్ ఎక్స్, ఫోర్బ్స్ పోల్ లోనూ డొనాల్డ్ ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచారు. ఇందులో భాగంగా... ట్రంప్ 51శాతం, కమలా హారిస్ 49 శాతం పాయింట్లతో ఉన్నారు! ఈ సందర్భంగా స్పందించిన హారిస్ ఎక్స్ వ్యవస్థాపకుడు డ్రిటన్ నేషొ.. యూఎస్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కీలకమని పేర్కొన్నారు.