డోనాల్డ్ ట్రంప్ అటాక్ టీ-షర్టులు వైరల్!
పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సాయుధుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుస్తోంది
By: Tupaki Desk | 15 July 2024 5:29 AM GMTపెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సాయుధుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడికి ఈ ఘటన ఓ ఉదాహరణ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, ట్రంప్ అనుచరులు, ప్రపంచ దేశాల పలు అధినేతలు ఈ దాడిని ఖండించారు.. రాజకీయ హింస సహించరానిదని నొక్కి చెప్పారు. ఆ సంగతి అలా ఉంటే... దాడి జరిగిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ ముఖంపై రక్తంతో పిడికిలి గాలిలోకి విసురుతూ ఫైట్, ఫైట్ అంటూ చేసిన దృశ్యాలు, ఫోటోలు వైరల్ గా మారాయి.
పైగా ఈ ఘటన, అనంతరం ట్రంప్ ఆత్మస్థైర్యానికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈ సందర్భంగా ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగినట్లు పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. బైడెన్ పై ట్రంప్ విజయావకాశాలు 70% పెరిగినట్లు తెలిపాయి. ఇదే సమయంలో ముఖంపై రక్తంతో పిడికిలి బిగించిన ట్రంప్ ఫోటోలతో టీ-షర్టులు వైరల్ గా మారాయి.
అవును... చెవిపై బుల్లెట్ గాయం అనంతరం ముఖంపై రక్తం మరకలతో కూడా ఆ వయసులో ట్రంప్ "ఫైట్.. ఫైట్.." అంటూ అరుస్తూ చూపించిన ఆత్మస్థైర్యానికి సంబంధించిన ఫోటోలతో కూడిన టీ-షర్ట్ లు ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. ఇదే సమయంలో నెట్టింట ట్రంప్ ఆత్మస్థైర్యానికి సంబంధించిన కామెంట్లూ వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలో ట్రంప్ ఫ్యాన్స్ సంఖ్య పెరిగిందని అంటున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ లోని ఓ నివేదిక ప్రకారం.. దాడి జరిగిన రెండు గంటల్లోనే మొదటి బ్యాచ్ టీ-షర్టులు ఆలీబాబాకు చెందిన ప్రముఖ చైనీస్ ఇ-కామర్స్ ఫ్లాట్ ఫాం టావోబోలోలో అమ్మకానికి వచ్చాయి. అయితే ఈ ధోరణి చైనాకు మాత్రమే పరిమితం కాలేదు. యూఎస్ లోనూ "ఫైట్.. ఫైట్.. ఫైట్!" అని చెప్పే టీ-షర్టు రన్నింగ్ లో ఉన్నాయి.