కమల "జాతి"పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు... గతం గుర్తుచేస్తున్న నెటిజన్లు!
అవును... ట్రంప్ కు నోటి దురత కాస్త ఎక్కువనేది ఆయన వ్యతిరేక వర్గం బలంగా చెబుతుందని అంటుంటారు.
By: Tupaki Desk | 1 Aug 2024 3:57 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిన్నటివరకూ ఒకలెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా.. కమలా హారీస్ ఎంట్రీ తర్వాత పరిస్థితి మారిపోయిందంటూ పలు సర్వేలు చెబుతున్న సంగతి తెలిసిందే. డెమోక్రాట్ల తరుపున జో బైడెన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పోటీలో ఉన్నప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్లుగా పరిస్థితి ఉన్న నేపథ్యంలో... ఆ స్థానంలోకి కమలాహారీస్ వచ్చిన తర్వాత లెక్కలు మారాయని, ట్రంప్ వర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొందని అంటున్నారు.
ఈ సమయంలో.. కమలా హరీస్ రాకముందు, ప్రధానంగా ట్రంప్ పై కాల్పుల ఘటన అనంతరం ఆయన విజయవకాశాలు భారీగా పెరిగాయని అంటున్న నేపథ్యంలో... కమలా హారీస్ ఎంట్రీ తర్వాత అవి పూర్తిగా మారిపోయాయని.. ఇప్పుడు వారిద్దరి మధ్య గెలుపు అవకాశాల తేడా ఒక్కశాతానికి తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలో కమలా హరీస్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జాతి ప్రస్థావన తెచ్చారు!
అవును... ట్రంప్ కు నోటి దురత కాస్త ఎక్కువనేది ఆయన వ్యతిరేక వర్గం బలంగా చెబుతుందని అంటుంటారు. ఈ సమయంలో... తాజాగా కమలా హారీస్ పై అలాంటి వ్యాఖ్యలే చేశారని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఆమె గతంలో ఎప్పుడూ ఇండియన్ వారసత్వాన్నే ప్రచారం చేశారని.. ఇప్పుడు సడన్ గా నల్లజాతి మహిళగా పిలిపించు కోవాలనుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
అక్కడితో ఆగని ఆయన... కమల ఇండియన్ లేదా నల్లజాతి మహిళ అనే విషయం తనకు తెలియదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో... ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ సందర్భంగా వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని పేర్కొంది.
కాగా... కమలా హారీస్ పై డొనాల్డ్ ట్రంప్ "జాతి"కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు! గతంలో అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హారీస్ నల్లజాతి స్త్రీ అయినందున ఆ పదవికి పనికిరారంటూ నాడు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ నోరు పారేసుకున్నారు. ఈ మేరకు ఆమె అసలు అమెరికాలోనే జన్మించలేదంటూ వైట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు!
ఇందులో భాగంగా... ఆమె ఓ నల్లజాతి మహిళ.. ఆమె తల్లితండ్రులు ఇక్కడకు వలస వచ్చారు.. అసలు ఆమె ఇక్కడ జన్మించలేదనేది తనకున్న సమాచారం.. అలాంటి వ్యక్తి అమెరిక ఉపాధ్యక్షురాలిగా పనికి రారు.. వైట్ హౌస్ అవసరాలు తీర్చడానికి ఆమె అర్హురాలు కాదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ట్రంప్ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. దీనిపై నెటిజన్లు వివరణ ఇచ్చారు.
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి కమలా హారీస్ కు అన్ని అర్హతలూ ఉన్నాయని.. ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఆమె ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి అన్ని అర్హతలూ ఉన్నాయంటూ గళం వినిపించారు. గతంలో మాజీ ప్రెసిడెంట్ ఒబామా గురించి కూడా ట్రంప్ ఇలానే ప్రచారం చేశారు. ఆయన కెన్యాలో జన్మించారని తెలిపారు. దీంతో.. తాను హవాయిలో జన్మించినట్లు ఒబామా బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సి వచ్చింది!