నెతన్యాహూతో ట్రంప్ మంతనాలు.. నిజమేనా?!
ఈ నేపథ్యంలో నెతన్యాహూతో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మంతనాలు జరపడం సర్వత్రా ఆసక్తిగా మారింది.
By: Tupaki Desk | 15 Aug 2024 4:30 PM GMTనెతన్యాహూ.. కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. హమాస్ తీవ్ర వాదుల పీచమణ చందే నిద్రపోనంటూ అల్టిమేటం జారీ చేయడంతోపాటు దూకుడుగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని. అయితే.. హమాస్‌తో యుద్ధం కారణంగా.. ఇటు ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా నష్టపోతోంది. అయితే.. ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. కానీ, నెతన్యాహూ మాత్రం తన పట్టునువదిలి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో నెతన్యాహూతో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మంతనాలు జరపడం సర్వత్రా ఆసక్తిగా మారింది.
అయితే.. ఈ చర్చలు నిజమేనా? కాదా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే.. వాస్తవానికి నెతన్యాహూ .. ట్రంప్‌లు ఇద్దరూ మిత్రులే కావడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని కోరుకుంటున్నట్టు గతంలో నెతన్యాహూ ప్రకటించారు. అయితే.. వీరిద్దరి మధ్య చర్చల్లో యుద్ధం ఆపాలన్న సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. హమాస్‌తో యుద్ధాన్ని కట్టిబెట్టారని, కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేలా ముందుకు రావాలని ట్రంప్ సూచించినట్టు యాక్సిస్ మీడియా రిపోర్టు చేసింది.
ఇదిలావుంటే, అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లి.. అక్కడ పనిచేస్తున్న సీక్రెట్ ఏజెన్సీ మొస్సాద్ వివరాలు.. ఇజ్రాయెల్ పై కాలు దువ్వుతున్న ఇరాన్‌కు చేరినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఇరాన్ భద్రతా బలగాల్లోకి కీలక వ్యక్తులు పసిగట్టినట్టు కువైట్ పత్రిక పేర్కొనడం సంచలనంగా మారింది. అంటే.. ఒకవైపు నెతన్యాహూతో మాట్లాడుతూనే.. మరోవైపు ఇలా ఆ దేశానికి సహకారం అందించడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపే అంశం.
ప్రధానంగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యలో పాల్గొన్నట్లు భావిస్తున్న 10 మంది మొస్సాద్ ఏజెంట్ల జాబితాను ఇరాన్‌కు అందించారన్నది మరో కథనం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకే అమెరికా ఇలా చేసినట్లు తెలుస్తోంది. కానీ, దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు మాత్రం ఇప్పటికీ లభించలేదు.