Begin typing your search above and press return to search.

సంచలనాల ట్రంప్ తాజా నిర్ణయం ఇదే

అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నిమిషం నుంచి సంచలనాల మీద సంచలనాలకు తెర తీస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయానికి సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 7:44 AM GMT
సంచలనాల ట్రంప్ తాజా నిర్ణయం ఇదే
X

అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నిమిషం నుంచి సంచలనాల మీద సంచలనాలకు తెర తీస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడో విషయాన్ని స్పష్టం చేయాలి. ఎన్నికలకు ముందు నుంచి తానేం చెబుతున్నారో.. ఆ అంశాల మీద అలాంటి ఆదేశాల్ని జారీ చేయటం కనిపిస్తుంది. మహిళలు ఆడే క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు అయిన పురుషులను అనుమతించమని ఆయన చెప్పేవారు.అందుకు తగ్గట్లే.. తాజాగా ఆయన నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

అమెరికాలో ట్రాన్స్ జెండర్లు వివిధ పోటీల్లో పాల్గొనకుండా వారి మీద నిషేధం విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రమాణస్వీకారానికి కాస్త ముందుగా తాను పాల్గొన్న సభలో మాట్లాడిన ట్రంప్.. తాను అధ్యక్షుడిని అయ్యాక మహిళల క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు పాల్గొనకుండా చేస్తానని స్పష్టం చేయటం తెలిసిందే. అందుకు తగ్గట్లే తాజా ఉత్తర్వులు జారీ కానున్నట్లు చెబుతున్నారు.

ఈ ఆదేశాన్ని జాతీయ మహిళా..బాలికల క్రీడాదినోత్సవం రోజున విడుదల చేస్తారని తెలుస్తోంది. తాను తీసుకున్న నిర్ణయం కారణంగా అత్యున్నత స్థాయిల్లో పోటీ పడేందుకుకష్టపడే మహిళా అథ్లెట్ల హక్కులను కాపాడుతోందని రిపబ్లికన్ నేత నాన్సీ మేస్ చెబుతున్నారు. అయితే.. ఈ అంశంపై పలు మానవహక్కుల సంఘాలు తప్పు పడుతున్నాయి. ఇది వివక్షకు తావిస్తుందని హెచ్చరిస్తున్నారు.

కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్ వేదికగా అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్ కు సంబంధించిన విషయంలోనూ లింగ వివాదం నడిచింది. అప్పుడు కూడా ట్రంప్ తన వాదనను వినిపించి సంచలనానికి మారుపేరుగా నిలిచారు. అంతేకాదు.. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన డెమోక్రకటిక్ సభ్యురాలు ట్రాన్స్ జెండర్ సారా మెక్ బ్రైడ్ ను మహిళల బాత్రూంలోకి అనుమతించమని రిపబ్లికన్లు ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చారు. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తాయి.