Begin typing your search above and press return to search.

ఓడిపోతే.. ఆ దేశానికి షిఫ్టు అవుతా.. ట్రంప్ సంచలనం

అంతేనా.. మళ్లీ మరోసారి మనం అక్కడ కలుద్దామన్న మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2024 5:13 AM GMT
ఓడిపోతే.. ఆ దేశానికి షిఫ్టు అవుతా.. ట్రంప్ సంచలనం
X

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన హాట్ ఇంటర్వ్యూ పూర్తైంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రంగంలోకి దిగి.. తన సొంతమైన ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ను టార్గెట్ చేయటమే కనిపిస్తుంది. అదే సమయంలో అమెరికన్లకు ఒక అల్టిమేటం లాంటి మాటను చెప్పారు. తాను కానీ ఎన్నికల్లో ఓడిపోతే తాను వెనుజులాకు షిప్టు అయిపోతానని చెప్పారు. అంతేనా.. మళ్లీ మరోసారి మనం అక్కడ కలుద్దామన్న మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

మలా మీద ఘాటు విమర్శలు చేయటమే కాదు.. తీవ్ర ఆరోపణలు చేశారు. హారిస్ వ్యవహారశైలి కమ్యూనిస్టుల మాదిరే ఉంటుందని ట్రంప్ పేర్కొంటూ.. అవునంటూ ఇంటర్వ్యూ చేసిన మస్క్ సైతం అంగీకరించటం గమనార్హం. ఇక ఇంటర్వ్యూ 40నిమిషాల ఆలస్యంగా మొదలైంది. చాలామందికి ఇంటర్వ్యూ ఆడియో సరిగా వినిపించలేదు. దీనికి డీడీవోఎస్ దాడి కారణంగా మస్క్ పేర్కొన్నారు. ట్రంప్ ఇంటర్వ్యూను 20 కోట్ల మంది విన్నారని మస్క్ చెప్పారు. ఇక.. ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఎక్స్ హ్యాండిల్ 200 మిలియన్లకు పైగా ఇంప్రెషన్లు అందుకున్నట్లుగా ట్రెండింగ్ పాలిటిక్స్ కు చెందిన కొలిన్ రోగ్ వెల్లడించారు.

ఒక బిలియనీర్ తన చేతిలో ఉన్న సోషల్ మీడియా వేదికను అసరాగా చేసుకొని.. అమెరికా అధ్యక్ష పదవిని ఇంటర్వ్యూ చేసే పేరుతో.. ట్రంప్ వ్యాఖ్యలను.. ఆయన అభిప్రాయాల్ని తాను కూడా అంగీకరిస్తున్నట్లుగా.. మద్దతు పలుకుతున్నట్లుగా వ్యవహరించటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. ట్రంప్ తో ఇంటర్వ్యూ తర్వాత కమలా హారిస్ ను కూడా తాను ఇంటర్వ్యూ చేస్తానని మస్క్ పేర్కొన్నారు. అయితే.. కమలా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఆమె టీం మాత్రం రియాక్టు అయ్యారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మస్క్ అమెరికా ప్రజాస్వామ్యాన్ని నియంత్రించటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సంచలనంగా మారిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

- కమలా హారిస్ అబద్ధాలు చెప్పే చిల్లర వ్యక్తి. బైడెన్ కంటే బలహీన అభ్యర్థి. ఆమె అతివాద వామపక్ష ఉన్మాది. మరింత గందరగోళం స్రష్టించే మనిషి. హారిస్ మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్నారు. ఇంకో ఐదు నెలలు అధికారం చెలాయిస్తారు. ఏదైనా చేయొచ్చు కానీ ఏమీ చేయరు. అంతా మాటలే. ఆమె బలహీన అభ్యర్థి.

- దేశంలోని సరిహద్దుల నుంచి వేలాది మంది అక్రమంగా ప్రవేశిస్తుంటే అడ్డుకోవటంలో హారిస్ ఫెయిల్ అయ్యారు. చట్టబద్ధ వలసలకు నేను అనుకూలమే. అక్రమ వలసల్ని వ్యతిరేకిస్తా. అధికారంలోకి రాగానే అక్రమ వలసదారుల్ని తిప్పి పంపే అతి పెద్ద కార్యాచరణను చేపట్టాల్సి ఉంది. అంతకు మించి మరో దారి లేదు.

- బైడెన్.. హరిస్ అనుసరించిన సరిహద్దుల విధానం కారణంగా వలసలు పెద్ద ఎత్తున అమెరికాకు చేరారు. వీరి కారణంగా అమెరికాలో భారీగా హింస పెరిగిందని ట్రంప్ వ్యాఖ్యానిస్తే.. దీనికి ఎలాన్ మస్క్ సైతం తన అంగీకారాన్ని తెలపటం గమనార్హం.

- కమలా హారిస్ గెలిస్తే అమెరికాను నాశనం చేస్తారు. 60 మిలియన్లు మంది అక్రమ వలసదారులు దేశంలోని ప్రవేశిస్తారు. వారంతా అతివాద భావజాలంతో ఉంటారు. నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.

- తమ ఆటల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్.. చైనా అధినేత షీ జిన్ పింగ్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ లు మొదటి స్థానంలో ఉన్నారు. వారంతా తమ దేశాల్ని ప్రేమిస్తున్నారు. వాళ్లను ఎదుర్కోవటానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ లేకపోయి ఉంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసేది కాదు.

- నాపై కాల్పుల ఘటనలో భద్రతాధికారుల మధ్య సమన్వయం లోపించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే దేశం విడిచి వెళ్లిపోతా. నేను ఓడిపోతే మనం మళ్లీ వెనెజులాలో కలుద్దాం. మన భేటీకి అమెరికా కంటే సురక్షితమైన ప్రదేశం అదే. అందుకే అక్కడికి వెళ్లిపోతా. మీరూ రండి. మనం సమావేశమవుదాం. డిన్నర్ చేద్దాం.

- వెనుజులాలో ప్రమాదకరమైన నేరస్థులను జైళ్ల నుంచి విడుదల చేసి అమెరికాకు అక్రమంగా వలస పంపిస్తున్నారు.