Begin typing your search above and press return to search.

తెలంగాణ అత్యల్ప, అత్యధిక మెజారిటీ సాధించిన సీట్లివే!

తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీలో గెలిపించారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:31 AM GMT
తెలంగాణ అత్యల్ప, అత్యధిక మెజారిటీ సాధించిన సీట్లివే!
X

తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీలో గెలిపించారు. దీంతో... నూతన ప్రభుత్వ ఏర్పాట్లకు కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా సీఎంగా రేవంత్‌ రెడ్డి ‍ప్రమాణ స్వీకారానికి ప్లాన్‌ జరుగుతుండగా.. మరోవైపు కేబినెట్ కూర్పు కోసం హస్తిన వేదికగా కసరత్తులు జరుగుతున్నాయి! ఈ సమయంలో... తాజా ఎన్నికల్లో కొద్ది ఓట్ల మార్జిన్‌ తో గట్టేక్కినవారు.. భారీ మెజార్టీతో రికార్డు సృష్టించిన వారు ఎవారెవారా అనే చర్చ మొదలైంది.

ఈ సమయంలో తాజాగా ఎన్నికల్లో బోటా బొటీగా గట్టేక్కిన వారు బీఆరెస్స్ అభ్యర్థే కాగా.. భారీ మెజారిటీ సాధించిన వారు కూడా బీఆరెస్స్ అభ్యర్థులే కావడం గమనార్హం. వీరిలో చేవెళ్లలో కాలె యాదయ్య (బీఆరెస్స్) కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గట్టేక్కగా... అత్యధికంగా కుత్బుల్లాపూర్‌ లో కేపీ వివేకానంద్‌ (బీఆరెస్స్) 85,576 ఓట్ల మెజార్టీతో వీజయం సాధించారు.

ఈ క్రమంలో 10వేలకు లోపు కాస్త పైనా కాంగ్రెస్ గెలిచిన సీట్లివే:

లక్ష్మీ కాంతారావు తోట (జుక్కల్) - 1152

జి మదుసూదన్ రెడ్డి (దేవరకద్ర) - 1392

పీ సుదర్శన్ రెడ్డి (బోధన్) - 3062

వేదం బొజ్జు (ఖానాపూర్) - 4702

డాక్టర్ కుచికుల్ల రాజేష్ రెడ్డి (నాగర్ కర్నూల్) - 5248

కసిరెడ్డి నారాయణ రెడ్డి (కల్వకుర్తి) - 5410

పటోల్ల సంజీవ రెడ్డి (నారాయన్ ఖేడ్) - 6547

బీ మోహన్ రెడ్డి (తాండూర్) - 6583

కే శంకరయ్య (షాద్ నగర్) - 7128

రేవూరి ప్రకాశ్ రెడ్డి (పర్కాల్) - 794

చిట్టేం పర్నికా రెడ్డి (నారాయన్ పేట్) - 7951

మైనంపల్లి రోహిత్ (మెదక్) - 10157

కాంగ్రెస్ అభ్యర్థులు అరౌండ్ 15వేల మెజారిటీతో గెలిచిన సీట్లివే!:

ఆది శ్రీనివస్ (వేములవాడ) - 14581

గడ్డం ప్రసాద్ కుమార్ (వికారాబాద్) - 1289

జనంపల్లి అనిరుధ్ రెడ్డి (జడ్చర్ల) - 15171

నైని రాజేందర్ రెడ్డి (వరంగల్ వెస్ట్) - 15331

కొండా సురేఖ (వరంగల్ ఈస్ట్) - 15652

10వేలలోపు మెజారిటీతో బీజేపీ గెలిచిన సీట్ల వివరాలివే!:

డాక్టర్ పాల్వై హరీష్ బాబు - 3088

పయల్ శంకర్ (ఆదిలాబాద్) - 6692

కటిపల్లి వెంకట రమణారెడ్డి (కామారెడ్డి) - 6741

10వేల లోపు మెజారిటీతో బీఆరెస్స్ గెలిచిన స్థానాలివే...!

కే యాదయ్య (చేవెల్ల) - 268

గంగుల కమలాకర్ (కరీంనగర్) - 3163

వేముల ప్రశాంత్ రెడ్డి (బాల్కొండ) – 4533

జి జగదీశ్ రెడ్డి (సూర్యపేట్) - 4606

టి. వెంకట రావు (భద్రాచలం) - 5719

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల్) – 7036

జీ మహిపాల్ రెడ్డి (పట్టాన్ చెరు) - 7091

చింతా ప్రభాకర్ (సంగారెడ్డి) – 8217

శునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్) - 8855

కల్వకుంట్ల సంజయ్ (కోరట్ల) – 10305

50వేలకుపైగా మెజారిటీ సాధించిన సీట్లివే!

రాష్ట్రంలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇందులో భాగంగా... అత్యధికంగా కుత్బుల్లాపూర్‌ లో బీఆరెస్స్ అభ్యర్థి కేపీ వివేకానంద్‌ 85,576 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ తర్వాత స్థానంలో సిద్దిపేటలో హరీశ్‌ రావు (బీఆరెస్స్) 82,308, చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం) 81,660, కూకట్‌ పల్లిలో మాధవరం కృష్ణారావు (బీఆరెస్స్) 70,387, నకిరేకల్‌ నుంచి వేముల వీరేశం (కాంగ్రెస్‌) 68,839 ఓట్ల మెజార్టీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఇలా 50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్‌ నుంచి 13 మంది, బీఆరెస్స్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు.