Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కి ఖుషీని ఇచ్చే హాటెస్ట్ స్వీటెస్ట్ సర్వే...!

పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్నోవేటివ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ( ప్రిజం) అన్న సంస్థ లేటెస్ట్ గా చేసిన సర్వేలో గులాబీ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని తెలియచేసింది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 1:15 PM GMT
బీఆర్ఎస్ కి  ఖుషీని ఇచ్చే హాటెస్ట్ స్వీటెస్ట్ సర్వే...!
X

తెలంగాణాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది కొద్ది రోజూల్లో తేలిపోతుంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. దాంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది కచ్చితంగా వెల్లడి అవుతుంది. ఈ కొద్ది రోజుల వ్యవధిలో ఓటర్ల నాడి ఎలా ఉంది అన్నది తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.

అనేక రకాలైన సర్వేలు అటు కాంగ్రెస్ గెలుస్తుంది అని ఇటు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఒక సర్వే అధికార

బీఆర్ఎస్ గెలుస్తుంది అని క్లారిటీగా చెప్పేసింది. పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్నోవేటివ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ( ప్రిజం) అన్న సంస్థ లేటెస్ట్ గా చేసిన సర్వేలో గులాబీ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని తెలియచేసింది.

ఈ సర్వే వేసిన అంచనా ప్రకారం చూస్తే అధికార బీయారెస్ కి 71 నుంచి 76 మధ్యలో సీట్లు దక్కుతాయని తెలుస్తోంది. అంతే కాదు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీయార్ ఇటీవల కాలంలో జోరు పెంచి వరసబెట్టి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి మంచి ఆదరణ దక్కుతోందని కూడా పేర్కొంది. అలాగే మంత్రి కేటీయార్ కి కూడా బగా పాపులారిటీ పెరిగింది అని సర్వే తేటతెల్లం చేసింది.

ఇక గత అయిదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణంగా మహిళలు వృద్ధుల వంటి కీలకమైన ఓటర్ గ్రూపుల నుండి మద్దతు పూర్తి స్థాయిలో దక్కుతోంది అని సర్వే పేర్కొంది. అదే విధంగా నిరుద్యోగ యువతతో పాటు, దళితులలో కొంత మేర అసంతృప్తి ఉందని స్పష్టం చేసింది.

ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ గతంలో కంటే తన పరిస్థితిని మెరుగుపరచుకుందని, కొన్ని కీలకమైన ప్రాంతాల్లో మెరుగైన ఓట్ల శాతంతో కాంగ్రెస్‌కు 34 నుంచి 39 సీట్లు వస్తాయని ప్రిజం సర్వే అంచనా వేసింది. మరో వైపు చూస్తే బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు హామీల ప్రభావంపైన కూడా సర్వే చేసింది.

బీఆర్ఎస్ రెండు పర్యాయాల పాలన మీద వ్యతిరేకత ఉన్నా కూడా కాంగ్రెస్ లో ఉన్న కూడా అంతర్గత వివాదాలు అలాగే బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల అది కొంత మేర మాత్రమే ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే 2018 ఫలితాల కంటే స్వల్ప మెరుగుదల ఉంటుదని సర్వే అంచనా కట్టింది.

అంటే బీజేపీకి ఈసారి మూడు నుంచి నాలుగు సీట్ల దాకావస్తాయని తేలింది. బీజేపీకి తెలంగాణా వ్యాప్తంగా సరైన నాయకత్వ లోపంతో పాటు సరైన వ్యూహాలు లేకపోవడం వల్ల కూడా అనెక సవాళ్లను ఎదుర్కొంటోందని అంటున్నారు.

మజ్లీస్ పార్టీ విషయానికి వస్తే హైదరాబాద్‌లో ఏడు సీట్లను తిరిగి పొందే అవకాశం ఉందని సర్వే తేల్చింది. ఇక ఈసారి గట్టి పోటీ అయిదు స్థానాల్లో ఉందని సర్వే తేల్చింది. ప్రిజం సంస్థ ఒక విజన్‌తో ముందుకు వచ్చింది. ఈ సంస్థ ప్రారంభంలో డిజిటల్ ప్రచారాలు, విధాన రూపకల్పన సేవలు వంటి సేవలను అందించడం జరిగింది.

అ తరువాత మెల్లగా పోల్ మేనేజ్‌మెంట్, రాజకీయ పార్టీలకు బూత్ స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రమంగా ప్రచారాలను కూడా నిర్వహిస్తూ వచ్చింది. ఇపుడు సర్వేలు చేస్తూ కూడా తన సమర్ధతను చాటుకుంటోంది.