బాడీ టెంపరేచర్ కు తగ్గట్లు ఈ టీషర్ట్ రంగులు మార్చేస్తుంది
కొన్నిసార్లు అంతే. కొందరు తయారు చేసే ఉత్పత్తులకు సంబంధించిన ప్రచారం పెద్దగా జరగదు.
By: Tupaki Desk | 4 Nov 2024 4:45 AM GMTకొన్నిసార్లు అంతే. కొందరు తయారు చేసే ఉత్పత్తులకు సంబంధించిన ప్రచారం పెద్దగా జరగదు. కానీ.. వారు కనుగొన్న వస్తువుల గురించి తెలిసినప్పుడు మాత్రం ఆశ్చర్యపోతుంటాం. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవలోకే చెందింది. తమిళనాడుకు చెందిన చొక్కలింగం అనే వ్యక్తి తయారు చేసిన టీషర్ట్గ్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం.. బాడీ టెంపరేచర్ కు అనుగుణంగా టీషర్ట్ రంగులు మార్చేయటమే.
స్టార్ట్ అప్ ఇండియా పథకంలో భాగంగా భిన్నమైన ఈ టీషర్ట్ ను తయారు చేశారు తిరుప్పూర్ కు చెందిన చొక్కలింగం. దీనికి అవసరమైన రంగుల్ని సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ టీషర్ట్ వేసుకున్న తర్వాత శరీర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా రంగులు మారే గుణం ఇందులో ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు ధరించినా జ్వర తీవ్రతను గుర్తించే వీలుందని చెబుతున్నారు.
ఎర్రమందారం పువ్వు.. ఉల్లిగడ్డ తొక్కు లాంటి సహజ వస్తువులతో తయారు చేసిన ఇంకును ఈ టీషర్ట్ తయారీకి వినియోగించారు. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చినప్పుడు రంగులు మారటం.. మళ్లీ టెంపరేచర్ తగ్గితే పూర్వ రంగులోకి వచ్చేలా చేయటం దీని ప్రత్యేకత. సెప్టెంబరు 28, 29 తేదీల్లో మధురైలో జరిగిన స్టార్టప్ ఇండియాలో పాల్గొన్న అతని టీషర్ట్ పలువురిని ఆకర్షించింది.
మొదట తయారు చేసిన టీషర్ట్ పింక్.. బ్లూ కలర్ ఇంకుతో పరీక్షించి చూడగా.. సక్సెస్ అయ్యారు. బాడీ టెంపరేచర్ 99 డిగ్రీల ఫారిన్ హీట్ కు చేరుకున్నప్ుపడు మాత్రం టీషర్టుపై కలర్ మారుతుంది. మళ్లీ టెంపరేచర్ తగ్గిన తర్వాత పాత రంగులోకి వచ్చేస్తుంది. ఈ టీషర్ట్ కు తిరుప్పూర్ నిఫ్ట్ డీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అవసరమైన సూచనలు చేసింది. అంతేకాదు.. ఈ టీషర్ట్ పలువురిని ఆకర్షించటంతోపాటు.. ఫిన్ లాండ్ లో జరిగే ఎగ్జిబిషన్ లో పాల్గొనేందుకు చొక్కలింగంకు ఆహ్వానం అందించింది. రాబోయే రోజుల్లో మల్టీ కలర్ లోనూ ఈ తరహా టీషర్ట్ తయారు చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. ప్రతి ఏడాది మూడు కొత్త ఆవిష్కరణల్ని రూపొందించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.