Begin typing your search above and press return to search.

గులాబీ సోషల్ వార్ రూం డిజైన్ చెప్పేసిన కేటీఆర్!

తెలంగాణలోని మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే.. గులాబీ పార్టీ లెక్క కాస్త వేరుగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 5:45 AM GMT
గులాబీ సోషల్ వార్ రూం డిజైన్ చెప్పేసిన కేటీఆర్!
X

తెలంగాణలోని మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే.. గులాబీ పార్టీ లెక్క కాస్త వేరుగా ఉంటుంది. సహజసిద్ధంగా రాజకీయ పార్టీల్లో పక్కా ప్లానింగ్ కనిపించదు. కానీ.. బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నం. కీలకమైన ఎన్నికల వేళ.. వారి పోల్ మేనేజ్ మెంట్ తో పాటు.. బ్లాక్ స్థాయిలోనూ పార్టీని తీసుకెళ్లే తీరు.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లకు వెళ్లేందుకు వీలుగా చేసే ఏర్పాట్లు అన్ని ఇన్ని కావు. వీటితో పాటు.. ఎన్నికల వేళ కీలకంగా మారిన సోషల్ మీడియా విషయంలోనూ ఆ పార్టీ ప్లానింగ్ ఎలా ఉంటుందన్న విషయంపై తాజాగా మరింత క్లారిటీ వచ్చింది.

గులాబీ పార్టీ సోషల్ మీడియా వ్యూహాన్నితాజాగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పార్టీకి చెందిన పలువురితో ఏర్పాటు చేసిన భేటీలో ఆయన సోషల్ మీడియా ప్రాధాన్యత గురించి వివరించటమే కాదు.. సోషల్ మీడియాను ఎన్నికల్లో ఒక ఆయుధంగా ఎలా వాడుకోవాలన్న దానిపై బ్లూప్రింట్ ఇచ్చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ సోషల్ మీడియా వార్ రూంను ఏర్పాటు చేయటమేకాదు.. వాటి కార్యకలాపాల్ని పర్యవేక్షించేందుకు వీలుగా సెంట్రల్ వార్ రూమ్ ఏర్పాటు చేసిన వైనాన్ని పేర్కొన్నారు.

సెంట్రల్ వార్ రూంలో 380 మందికి పైగా పాలు పంచుకుంటున్నారని.. సెంట్రల్ వార్ రూం నుంచి అందే సూచనలు.. ఆదేశాల్ని క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇన్ ఛార్జిలకు ఉంటుందని పేర్కొన్నారు.2014 ఎన్నికల తర్వాత నుంచి సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగిందని.. ఇదే సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారన్నారు.

ఎన్నికల వేళ పార్టీ విడుదల చేసిన ఎన్నికల హామీలపై వచ్చే విమర్శల్ని తిప్పి కొట్టటంతో పాటు.. అందులోని అంశాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేలా గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు సైతం.. కొత్త తరహాలో ఉండే సోషల్ మీడియా ప్రచారాలకు అలవాటు పడాలన్న ఆయన.. పార్టీ గుర్తును డీపీలుగా పెట్టుకోవటంతో పాటు..చొక్కాలపైనా గుర్తులను ధరించాలన్నారు.

ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్ ఛార్జిలతో బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలన్న కేటీఆర్.. ఎన్నికలు ముగిసే వరకు ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎండగట్టటం పైనే ఫోకస్ చేయాలన్నారు. నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే వార్ రూంలో స్థానిక అంశాలతో పాటు.. ప్రత్యర్థులు చేసే ప్రచారానికి అడ్డుకట్ట వేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.