Begin typing your search above and press return to search.

జంపింగుల‌కు 'తెలంగాణ పాలిటిక్స్' స్ఫూర్తినిస్తున్నాయా?

ఇదే ఇప్పుడు ఏపీలోనూ స్ఫూర్తి నింపుతోందా? జంప్ చేసేందుకు నాయ‌కులు వెనుకాడ‌క పోవ‌డానికి ఇదే కార‌ణ‌మా? అనేచ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 3:30 PM GMT
జంపింగుల‌కు తెలంగాణ పాలిటిక్స్ స్ఫూర్తినిస్తున్నాయా?
X

కొన్ని వారాల కింద‌ట జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌స‌మ‌యంలో జంపింగులు జోరుగా సాగాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనేతేడా లేకుండా.. నాయ‌కులు జంపింగులు చేసుకుంటూ పోయారు. అయితే.. ఇలా జంప్ చేసిన‌వారికి కొన్ని పార్టీల్లో టికెట్లు ద‌క్కాయి. కొంద‌రికి ద‌క్క‌లేదు.అయితే.. జంప్ చేసి టికెట్ ద‌క్కించుకున్న వారిలో చాలా మంది విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇదే ఇప్పుడు ఏపీలోనూ స్ఫూర్తి నింపుతోందా? జంప్ చేసేందుకు నాయ‌కులు వెనుకాడ‌క పోవ‌డానికి ఇదే కార‌ణ‌మా? అనేచ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం ఏపీలోనూ జంపింగులురెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే గుంటూరులో ఒక ఎమ్మెల్యే పీచే ముడ్ (సొం త పార్టీలోకి వ‌చ్చేందుకు) ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇక‌, కాకినాడ‌లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మార్పున‌కు సిగ్న‌ళ్లు ఇచ్చే శారు. వీరికి ఇంత ధైర్యంగా జంప్ చేసేందుకు స్ఫూర్తి ఎవ‌రు? అంటే.. తెలంగాణ ఎన్నిక‌లే అంటున్నారు ప‌రిశీల‌కులు.

తెలంగాణలో ఏం జ‌రిగిందంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు.. చివ‌ర‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చి.. నామినేష‌న్ల ఘ‌ట్టం ప్రారంభ‌మ‌య్యా క కూడా నాయ‌కులు చాలా మంది అటు-ఇటు మారి కండువాలు క‌ప్పుకొన్నారు. ఇలా జంపింగ్ చేసిన వారిలో అధికార పార్టీ బీఆర్ఎస్‌, నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు గెలుపు గుర్రం ఎక్క‌గా.. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ నుంచి అలిగి, టికెట్ రాలేద‌ని పార్టీ మారిన వారిని ప్ర‌జ‌లు ఓడించారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరి గెలుపు గుర్రం ఎక్కిన నాయ‌కులు.. వేముల వీరేశం( నకిరేకల్), జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్), కసిరెడ్డి నారాయణ రెడ్డి(కల్వకుర్తి), మందుల సామేల్(తుంగతుర్తి), తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం.), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(పాలేరు), పాయం వేంకటేశ్వర్లు(పినపాక), కోరం కనకయ్య(ఇల్లందు). ఉన్నారు.

ఇక‌, అప్ప‌టి ప్ర‌తిప‌క్ష‌ కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌ లో చేరి ఓడిపోయిన నాయ‌కులు చాలా మంది ఉన్నారు. వీరిలో వనమా వెంకటేశ్వర్ రావు(కొత్తగూడెం), సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి), రేగా కాంతారావు(పినపాక), హరిప్రియ నాయక్(ఇల్లందు), చిరుమర్తి లింగయ్య(నకిరేకల్), గండ్ర వెంకట రమణ రెడ్డి(భూపాల పల్లి), మెచ్చ నాగేశ్వరరావు(అశ్వారావు పేట), సురేందర్(ఎల్లారెడ్డి), హర్షవర్ధన్ రెడ్డి(కొల్లాపూర్), పైలెట్ రోహిత్ రెడ్డి(తాండూర్). దీంతో ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించిన వారు జంపింగుల‌కు వెనుకాడ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.